Instagram: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రత్యేక యాప్.. టిక్-టాక్‌కు పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో టిక్ టాక్ అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి.
కానీ, ప్రస్తుతం ఆ యాప్ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ఈ పరిస్థితిని అదునుగా తీసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్ ప్రయత్నిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్నది అన్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియా యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యేకంగా రీల్స్ కోసం ఓ కొత్త యాప్ (Reels App)ను లాంచ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ప్రత్యేక రీల్స్ యాప్‌పై ప్రకటన చెయ్యని మెటా
ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ అధినేత ఆడమ్ మొస్సోరి అధికారికంగా ప్రకటన కూడా చేశారు.
టెక్నాలజీ వార్తలను ప్రచురించే "ద ఇన్‌ఫర్మేషన్" పత్రికలో కూడా దీనికి సంబంధించిన కథనం వచ్చిందని తెలుస్తోంది.
అయితే, ఇన్‌స్టాగ్రామ్‌కు పేరెంట్ కంపెనీ అయిన మెటా సంస్థ మాత్రం ఇప్పటివరకు ప్రత్యేక రీల్స్ యాప్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.