Page Loader
ISRO: ఇస్రో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాల 'డాకింగ్‌' సక్సెస్‌
ఇస్రో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాల 'డాకింగ్‌' సక్సెస్‌

ISRO: ఇస్రో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాల 'డాకింగ్‌' సక్సెస్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన సంవత్సర ఆరంభంలోనే మరో వినూత్నమైన చరిత్రను లిఖించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ ఘనత సాధించినట్లు ఇస్రో గురువారం 'ఎక్స్‌' వేదికగా ప్రకటించింది. ఈ ఘనతను సాధించిన నాలుగో దేశంగా భారత్‌ పేరు నిలిచింది. గత డిసెంబర్ 30న తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్‌) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 (పీఎస్‌ఎల్‌వీ) ద్వారా జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఎ ఉపగ్రహాలను విడగొట్టింది.

వివరాలు 

సాంకేతికతలో భారత్ కూడా ఆ దేశాల సరసన

వీటి డాకింగ్ కోసం మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ, పలు కారణాలతో వాయిదా పడింది. చివరగా గురువారం అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించి, హోల్డ్ చేసిన తరువాత డాకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ విజయాన్ని ఇస్రో తన పోస్టులో ప్రకటించి, సాంకేతిక బృందానికి, భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేశాయి. తాజా ప్రయోగంతో ఈ సాంకేతికతలో భారత్ కూడా ఆ దేశాల సరసన చేరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాల 'డాకింగ్‌' సక్సెస్‌