Page Loader
Meta AI app:చాట్‌జీపీటీకి పోటీగా.. కొత్త ఏఐ యాప్‌ను లాంచ్‌ చేసిన మెటా 
చాట్‌జీపీటీకి పోటీగా.. కొత్త ఏఐ యాప్‌ను లాంచ్‌ చేసిన మెటా

Meta AI app:చాట్‌జీపీటీకి పోటీగా.. కొత్త ఏఐ యాప్‌ను లాంచ్‌ చేసిన మెటా 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

రోజురోజుకూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. చాట్‌బాట్‌ సేవల ద్వారా ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ చాట్‌జీపీటీ (ChatGPT)తో ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపు పొందుతోంది. ఈ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో మెటా సంస్థ కూడా తన సేవలను మరింత అభివృద్ధి చేస్తోంది. ఈ లక్ష్యంతో ప్రత్యేకంగా మెటా ఏఐ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రత్యేకత కలిగిన ఫీచర్లతో ఈ అప్లికేషన్‌ను తీసుకువచ్చినట్లు మెటా ప్రకటించింది.

వివరాలు 

ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ లో అప్లికేషన్‌ను విడుదల

లామా 4 లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారంగా రూపొందించిన తాజా ఏఐ యాప్‌ను మెటా విడుదల చేసింది. ఈ కొత్త ఏఐతో చాట్‌ చేయడం మరింత సులభతరం అయిందని కంపెనీ వెల్లడించింది. వాడుకదారుల నుంచి ఏ విధమైన ప్రశ్నలు వచ్చినా చక్కగా సమాధానం చెప్పగల సామర్థ్యం దీనికుందని తెలిపింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ వంటి మెటా అప్లికేషన్లలో రోజూ అనేక మంది మెటా ఏఐ సేవలను వినియోగిస్తున్నారు. ఈ యూజర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు ప్రత్యేకంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారుల కోసం ఈ అప్లికేషన్‌ను విడుదల చేసినట్లు తెలిపింది.

వివరాలు 

మల్టీటాస్కింగ్‌ ఫీచర్‌ 

మెటా ఏఐ వాయిస్‌ ఫీచర్‌ సాయంతో వినియోగదారులు చాట్‌బాట్‌తో సంభాషిస్తూ అదే సమయంలో తమ డివైజ్‌లో ఇతర యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే వినియోగదారులకు మల్టీటాస్కింగ్‌ సౌకర్యం లభిస్తుంది. అలాగే, మైక్రోఫోన్‌ ఆన్‌లో ఉందని గుర్తించేందుకు స్క్రీన్‌పై ఒక ప్రత్యేక ఐకాన్‌ కనిపిస్తుంది. ఈ ఏఐ అసిస్టెంట్‌ సహాయంతో ఇమేజ్‌ జనరేషన్‌, ఎడిటింగ్‌ వంటి పనులను చేయొచ్చు. దీనికోసం వాడుకదారులు టెక్ట్స్‌ రూపంలోనైనా, వాయిస్‌ రూపంలోనైనా ప్రాంప్ట్‌ ఇవ్వవచ్చు.

వివరాలు 

ఫుల్-డ్యూప్లెక్స్‌ స్పీచ్‌ టెక్నాలజీ 

ఫుల్‌-డ్యూప్లెక్స్‌ స్పీచ్‌ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన వాయిస్‌ డెమోను కూడా మెటా పరిచయం చేసింది. ఈ టెక్నాలజీ సహజమైన సంభాషణలకు శిక్షణ పొందిందని, అందువల్ల వినియోగదారుల ప్రశ్నలకు నేరుగా వాయిస్‌ రూపంలో సమాధానాలు అందించగలదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి ఈ వాయిస్‌ సేవలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక మరోవైపు, మెటా సంస్థ తన ఏఐ పవర్డ్‌ రే-బాన్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, తన ఏఐ వెబ్‌ వెర్షన్‌లో కూడా అనేక మెరుగుదలలు చేస్తోంది.