
Instagram: ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం.. సామాజిక మాధ్యమాల వేదికగా యూజర్లు ఫిర్యాదులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సేవల్లో అంతరాయం ఏర్పడింది. యాప్ లాగిన్‌తో పాటు సర్వర్ కనెక్షన్‌కు సంబంధించి సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం.
ఈ సమస్యపై అనేకమంది యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.
డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం రాత్రి 7:25 గంటల సమయంలో ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం సంభవించింది.
ఈ నేపథ్యంలో దాదాపు 19 వేల మంది యూజర్లు తమ ఫిర్యాదులను నమోదు చేశారు. ఈ సమస్యపై యూజర్లు ఎక్స్ (X) వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
'ఎక్స్' పై అతిపెద్ద సైబర్ దాడి
ఇదిలా ఉండగా, ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన 'ఎక్స్' (X) సేవలు డౌన్ అయిన విషయం తెలిసిందే.
ఒకే రోజులో మూడుసార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం కలిగిన విషయం గమనార్హం.
ఈ ఘటనపై స్పందించిన మస్క్, తమ సామాజిక మాధ్యమంపై అతిపెద్ద సైబర్ దాడి జరిగినట్లు తెలిపారు.
దీని వెనుక పెద్ద గ్రూప్ లేదా ఒక దేశం హస్తం ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ దాడికి ఉక్రెయిన్‌కు సంబంధం ఉండొచ్చని మస్క్ అనుమానం వ్యక్తం చేశారు.
సైబర్ దాడికి పాల్పడిన ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని ఆయన పేర్కొన్నారు.