Loading...
Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ సేవల్లో అంతరాయం.. యూజర్లకు తప్పని ఇబ్బందులు
మైక్రోసాఫ్ట్‌ సేవల్లో అంతరాయం.. యూజర్లకు తప్పని ఇబ్బందులు

Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ సేవల్లో అంతరాయం.. యూజర్లకు తప్పని ఇబ్బందులు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్‌ 365 సేవల్లో ఏర్పడిన భారీ సాంకేతిక సమస్య శుక్రవారం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికీ విస్తరించింది. ఔట్‌లుక్‌, టీమ్స్‌, కోపైలట్‌ వంటి సేవలను ఉపయోగించే వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికాలో మొదలైన అంతరాయం దాదాపు 12 గంటలపాటు కొనసాగింది. మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ సమస్యలను సరిచేసేందుకు ప్రయత్నించినప్పటికీ వెంటనే పూర్తి స్థాయిలో సేవలు సాధారణ స్థితికి రాలేదు.

Details

1.30 లక్షలకు పైగా ఫిర్యాదులు

అవుటేజ్‌లను ట్రాక్‌ చేసే డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం అమెరికాలో గురువారం మధ్యాహ్నం సమయంలో ఔట్‌లుక్‌ సమస్యలపై 1.30 లక్షలకు పైగా రిపోర్టులు నమోదయ్యాయి.

రాత్రి 11.30 గంటల సమయానికి కూడా 18,000కు పైగా ఫిర్యాదులు కనిపించాయి.

భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ సహా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల్లోనూ మైక్రోసాఫ్ట్‌ సేవలకు అంతరాయం నమోదైంది.

Details

ఇమెయిల్‌ వ్యవస్థలపైనే ఎక్కువ ప్రభావం

మైక్రోసాఫ్ట్‌ ప్రకారం Exchange Onlineపై ఆధారపడే Microsoft 365 ఫీచర్లు ఈ సమస్యతో ప్రభావితమయ్యాయి.

ఇమెయిల్‌, క్యాలెండర్‌, కాంటాక్ట్స్‌, టాస్క్‌లను నిర్వహించే ఈ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌ సమస్య కారణంగా వ్యాపార సంస్థల రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం పడింది.

అయితే Exchange Onlineపై ఆధారపడని కొన్ని సేవలు మాత్రం పనిచేశాయి. సైబర్‌ దాడి కారణంగా ఈ అంతరాయం ఏర్పడినట్లు తమకు సమాచారం లేదని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

ADVERTISEMENT

Details

భారత్‌లోనూ సంస్థలకు ఇబ్బందులు

ఈ అంతరాయం ప్రభుత్వ సంస్థలతో పాటు పలు కంపెనీలను ప్రభావితం చేసింది.

ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా ప్రభుత్వ విభాగాల్లో సమస్యలు తలెత్తాయి. OpenAI, Anthropic వంటి ఏఐ సంస్థలు మైక్రోసాఫ్ట్‌ కనెక్టర్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

భారత్‌లో ఇండిగో, ఆకాసా ఎయిర్‌ వంటి సంస్థల ఇమెయిల్‌ సపోర్ట్‌ సేవలపైనా ప్రభావం పడింది.

ADVERTISEMENT

Details

వరుస అవుటేజ్‌లపై పెరుగుతున్న ఆందోళన

ఈ ఏడాది జనవరిలోనూ మైక్రోసాఫ్ట్‌ 365 సేవల్లో అంతరాయం ఏర్పడింది. గతేడాది అక్టోబర్‌లో కూడా ఇదే తరహా సమస్య ఎదురైంది.

తాజాగా మరోసారి సేవలు దెబ్బతినడంతో మైక్రోసాఫ్ట్‌ సర్వీసుల విశ్వసనీయతపై వ్యాపార సంస్థల్లో ప్రశ్నలు మొదలయ్యాయి.

ఈ సమస్యను దీర్ఘకాలికంగా పరిష్కరించి మౌలిక సదుపాయాల స్థిరత్వాన్ని పెంచేందుకు అదనపు చర్యలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ADVERTISEMENT