Page Loader
Nasa: అంతరిక్షంలో గ్రహశకలాన్ని గుర్తించిన భారత విద్యార్థి.. అరుదైన అవకాశం కల్పించిన  నానా 
అంతరిక్షంలో గ్రహశకలాన్ని గుర్తించిన భారత విద్యార్థి.. అరుదైన అవకాశం కల్పించిన నానా

Nasa: అంతరిక్షంలో గ్రహశకలాన్ని గుర్తించిన భారత విద్యార్థి.. అరుదైన అవకాశం కల్పించిన  నానా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 14 ఏళ్ల విద్యార్థి దక్ష్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. తాను కనుగొన్న గ్రహశకలానికి తానే పేరు పెట్టుకునే అవకాశాన్ని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ఇచ్చింది. నాసాతో భాగస్వామిగా ఉన్న ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్టు (IASC) కింద 2023లో దక్ష్ మాలిక్ తన స్నేహితులతో కలిసి ఓ గ్రహశకలాన్ని గుర్తించాడు. ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్టు (IADP) కింద దక్ష్, తన ఇద్దరు స్నేహితులకు 2022లో గ్రహశకలాలను గుర్తించే అవకాశం లభించింది. వారి స్కూల్‌లోని ఆస్ట్రోనమీ క్లబ్ నాసా ఆధ్వర్యంలో నిర్వహించబడే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనమికల్ సెర్చ్ కొలాబరేషన్‌ (IASC)కు మెయిల్ పంపగా, ఈ అవకాశాన్ని పొందారు.

వివరాలు 

చిన్ననాటి నుంచే అంతరిక్షంపై ఆసక్తి 

దీంతో, ఏడాదిన్నరపాటు పరిశోధనలు చేసి, 2023లో గ్రహశకలాన్ని గుర్తించారు. ఆ గ్రహశకలం 2023 OG40 పేరుతో నమోదు అయ్యింది. తాజాగా, దానికి శాశ్వత పేరును పెట్టుకునే అవకాశం నాసా ఇచ్చింది. దీనిపై దక్ష్ మాలిక్ స్పందిస్తూ, చిన్ననాటి నుంచే తాను అంతరిక్షంపై ఆసక్తి కలిగి ఉన్నానని తెలిపాడు. గ్రహాలు, సౌరవ్యవస్థకు సంబంధించిన నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలను తరచుగా చూసేవాడినని చెప్పాడు. తాను ఎన్నాళ్లుగానో కలగన్న దాన్ని నేడు సాకారం చేసుకున్నానని హర్షం వ్యక్తం చేశాడు. ఈ గ్రహశకలాన్ని గుర్తించడంలో తాను నాసాలో పనిచేసే శాస్త్రవేత్తలా ఊహించుకున్న విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం తమ మనసులో 'డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్,' 'కౌంట్‌డౌన్' వంటి పేర్లు ఉన్నాయని తెలిపారు.