LOADING...
Neuralink: వచ్చే వారం రెండవ మెదడు చిప్‌ని అమర్చనున్నన్యూరాలింక్..  ప్రజలకు సూపర్ పవర్స్ ఇవ్వడమే లక్ష్యం: మస్క్‌
వచ్చే వారం రెండవ మెదడు చిప్‌ని అమర్చనున్నన్యూరాలింక్

Neuralink: వచ్చే వారం రెండవ మెదడు చిప్‌ని అమర్చనున్నన్యూరాలింక్..  ప్రజలకు సూపర్ పవర్స్ ఇవ్వడమే లక్ష్యం: మస్క్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2024
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్ బ్రెయిన్-కంప్యూటర్ స్టార్టప్ Nerualink దాని పరికరాన్ని ఒక వారంలో రెండవ మానవ మానవ మెదడులో చిప్‌ను అమర్చే ప్రయోగాలను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈవిషయాన్ని మస్క్‌,టాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు బుధవారం వెల్లడించారు.ఈ సంవత్సరం చివరకల్లా మరింతమంది మెదడులో దీన్ని అమర్చుతామని కూడా ప్రకటించారు.ఎక్స్‌లో జరిగిన ఓసమావేశంలో మస్క్‌,న్యూరాలింక్‌కు చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. బ్రెయిన్‌ చిప్‌ కెపాసిటీ,రాబోయే రోజుల్లో దాని వల్ల ఉపయోగాలు,మనిషి జీవితంపై దాని ప్రభావం వంటి కీలక అంశాలపై చర్చించారు. మొదటి ప్రయోగంలో నోలాండ్‌ అర్బాగ్‌కు అమర్చిన సమయంలో అప్పట్లో తలెత్తిన సమస్యలు రిపీట్ కాకుండా తీసుకోనున్నజాగ్రత్తలను వివరించారు. తమ ప్రయోగాలతో భవిష్యత్తులో డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌తో పోటీ పడగలిగే కెపాసిటీ మనిషికి వస్తుందని మస్క్‌ తెలిపారు.

వివరాలు 

మనుషులకు 'సూపర్‌ పవర్స్‌' ఇవ్వడమే ఉద్దేశ్యం 

మనుషులకు 'సూపర్‌ పవర్స్‌' ఇవ్వడమే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. అప్పుడే ఆర్టిఫిసియల్ ఇంటిలెజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీ వల్ల దీర్ఘకాలంలో తలెత్తే ముప్పును ఎదుర్కోగలమన్నారు. అతి తక్కువ సమయంలో మెదడు, వెన్నెముక వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపయోగకరంగా మారేలా చేస్తామని మస్క్‌ తెలిపారు. చిప్‌ అమర్చే సమయంలో మెదడు కణజాలంలోకి ప్రవేశపెట్టే ఎలక్ట్రోడ్లు బయటకు వస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సమస్యను వచ్చే రోజుల్లో చేపట్టబోయే చికిత్సల్లో పరిష్కరిస్తామని తెలిపారు. శస్త్ర చికిత్స సమయంలో ఉపయోగించే ఎయిర్‌ పాకెట్లను తొలగిస్తే అది సాధ్యమవుతుందని తెలిపారు.

వివరాలు 

లైవ్‌ స్ట్రీమ్‌ సమయంలో మాట్లాడిన అర్బాగ్‌

మనిషి మెదడులో సక్సెస్ ఫుల్ గా చిప్‌ను అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్‌ ప్రకటించింది. చిప్‌ను అమర్చిన వ్యక్తి నోలాండ్‌ అర్బాగ్‌ను మార్చిలో ప్రజల ముందుకు తీసుకొచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్నఅతడిని వీడియో గేమ్‌ సివిలైజేషన్‌ VI, చెస్‌ ఆడించింది. ఈ ఘటనను 'ఎక్స్‌'లో లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. అతను ఎవరి సాయం లేకుండా గేమ్‌ ఆడినట్లు తెలిపింది. లైవ్‌ స్ట్రీమ్‌ సమయంలో అర్బాగ్‌ మాట్లాడారు కూడా. జీవితంలో ఇక చేయలేననుకున్న చాలా పనులు సొంతంగా చేస్కుంటున్నట్లుఅతను సంతోషం వ్యక్తం చేశాడు ఈ టెక్నాలజీలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని తెలిపారు. అంతేకాకుండా, దీన్ని మరింత మెరుగుపరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని అన్నారు.

వివరాలు 

న్యూరాలింక్ ఇంప్లాంట్ ఏమి చేస్తుంది? 

న్యూరాలింక్‌ 'బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌'లో 8 మి.మీ వ్యాసం కలిగిన N1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో కంపేర్ చేస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 చిప్ ను అక్కడ అమరుస్తారు.ఈ సాధనానికి ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను బ్రెయిన్ లోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. ఎలక్ట్రోడ్లు సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు..బ్రెయిన్ లోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌కు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి.ఓవర్ అల్ గా ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లు ప్రవేశపెట్టొచ్చు.