
Sam Altman: బ్యాంకింగ్ రంగంలో AI వాయిస్ మోసం ముప్పు.. సామ్ ఆల్ట్‌మాన్ ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మానవజాతి ఎన్నో గొప్ప విజయాలను సాధించింది. అందులో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - AI) ఒక ముఖ్యమైన మైలురాయి. అయితే, ఇది ఎంతగానో ఉపయోగకరమైనదిగా భావించబడుతున్నా, అదే స్థాయిలో ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంది. చాలా మంది దీనిని అభివృద్ధి కోసం వాడుతుండగా, కొంతమంది మాత్రం దుర్వినియోగం చేస్తూ ప్రమాదాలను పెంచుతున్నారు. ఈ విషయంలో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ కీలక హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్‌లో బ్యాంకింగ్ రంగ ఆర్థిక సంక్షోభం గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
వాయిస్‌ప్రింట్‌కు కాలం చెల్లింది
వాషింగ్టన్‌లో నిర్వహించిన ఫెడరల్ రిజర్వ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన శామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ - ''ఇప్పటికీ కొన్ని ఆర్థిక సంస్థలు వాయిస్‌ప్రింట్‌ను గుర్తింపు విధానంగా వాడుతున్నాయి. కానీ ఇది భద్రతాపరంగా చాలా ప్రమాదకరమైన విషయం. కాలక్రమంలో ఇది ప్రామాణికతను కోల్పోబోతోంది. ఎందుకంటే, కృత్రిమ మేధ టూల్స్ వాయిస్‌ను అనుకరించే శక్తిని సంపాదించాయి. ఈ టెక్నాలజీ సహాయంతో ఎవరి గళాన్నైనా కాపీ చేసి, భద్రతా వ్యవస్థలను దాటివేసి డబ్బు చోరీ చేయడం సాధ్యమవుతుంది,'' అన్నారు.
వివరాలు
దశాబ్దం క్రితం వాయిస్ ప్రింట్ ఒక బలమైన గుర్తింపు
అలానే, వాస్తవాన్ని పోలిన వాయిస్ క్లోన్లతో పాటు, వీడియో క్లోన్లూ ఇప్పుడు మన ముందుకు వచ్చాయి. ఇవి నిజమైనవే అన్నట్టుగా అనిపించేందుకు అత్యంత ఆధునికంగా రూపొందించబడ్డాయి. దీనివల్ల నిజమైనది ఏది? నకిలీ ఏది? అన్నదాన్ని తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన గుర్తింపు పద్ధతులు అవసరం అవుతున్నాయి. దశాబ్దం క్రితం వాయిస్ ప్రింట్ ఒక బలమైన గుర్తింపు ప్రమాణంగా వ్యవహరించబడింది. బ్యాంకులు సంపన్న వినియోదారుల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. దాని ద్వారా వారు తమ అకౌంట్లను యాక్సెస్ చేసుకునే వీలుంది. కృత్రిమ మేధ ప్రమాదాల గురించి శామ్ ఆల్ట్‌మన్ మునుపెన్నడో హెచ్చరించిన సంగతి గుర్తు చేసుకోవాలి.
వివరాలు
ఏఐ ఎలాంటి మాయ అయినా చేస్తుంది
''ఏఐ తక్కువ సమయంలోనే గొప్ప విశ్వాసాన్ని సంపాదించింది. అయితే ప్రజలు దీనిపై గట్టి నమ్మకం పెట్టుకుంటుండటం కొంతవరకు ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే, చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడళ్లను నమ్మి ఆధారపడే వినియోగదారులకు, నిజం వంటి కల్పిత సమాచారాన్ని అందించే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో యథార్థాన్ని పక్కన పెట్టి, వినియోగదారుని సంతృప్తిపర్చేలా తప్పుడు సమాచారాన్ని రూపొందించగలవు. వాస్తవానికి ఉనికిలో లేని అంశాల గురించి కూడా అద్భుతంగా నమ్మదగినట్టుగా చెప్పగలుగుతాయి,'' అని వివరించారు. ''ఇలాంటీ పరిస్థితుల్లో అసలైన శక్తి వాస్తవిక ప్రపంచంలోనే ఉంటుంది. కృత్రిమ మేధ ఎంత అభివృద్ధి చెందినా, వాస్తవాల పరంగా అది పూర్తిగా నమ్మదగినది కాదు'' అని శామ్ ఆల్ట్‌మన్ స్పష్టంగా పేర్కొన్నారు.