Page Loader
OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ 
జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ

OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీకి మద్దతు ఇచ్చే మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత హార్డ్‌వేర్‌ల తయారీ వైపు దృష్టి సారించింది. ఈ దిశగా ఆపిల్‌ సంస్థకు మాజీ డిజైనర్‌గా పనిచేసిన జానీ ఐవ్‌ స్థాపించిన ఏఐ డివైజ్‌ స్టార్టప్‌ 'ఐఓ'ను (IYO) ఓపెన్‌ఏఐ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ కోసం సంస్థ దాదాపు 6.5 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.ఈ కొనుగోలుతో,చాట్‌జీపీటీ టెక్నాలజీని వినియోగిస్తూ ఓపెన్‌ఏఐ వినూత్న హార్డ్‌వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయనుంది. జానీ ఐవ్‌కి యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ వంటి ఉత్పత్తుల డిజైన్‌లో కీలక పాత్ర ఉంది. ఆయన స్థాపించిన సంస్థే 'ఐఓ', ఇది ఎయ్‌ఐ ఆధారిత హార్డ్‌వేర్ అభివృద్ధిపై కేంద్రీకరించి పనిచేస్తోంది.

వివరాలు 

ఓపెన్‌ఏఐ మొత్తం విలువ 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం

ఈ సంస్థను ఓపెన్‌ఏఐ పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ద్వారా, సంస్థ హార్డ్‌వేర్ రంగంలో మరో శక్తివంతమైన పోటీదారుగా మారనుంది. అయితే, ఏయే రకాల హార్డ్‌వేర్‌ను రూపొందించనున్నారు అన్న విషయమై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ కొనుగోలు అంశంపై ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ స్పందిస్తూ,సంస్థ స్థాపన తర్వాత అతిపెద్ద ముందడుగుగా దీన్ని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఓపెన్‌ఏఐ మొత్తం విలువ 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఓ విభాగానికి ఓపెన్‌ఏఐ ఎగ్జిక్యూటివ్‌ పీటర్ వెలిండర్‌ నాయకత్వం వహించనున్నారు. ఈడీల్‌ కోసం ఓపెన్‌ఏఐ మొత్తం 5 బిలియన్‌ డాలర్లను ఈక్విటీ రూపంలో చెల్లించింది.ఇప్పటికే ఓపెన్‌ఏఐకి 'ఐఓ'లో 23 శాతం వాటా ఉండగా,తాజా నిర్ణయంతో పూర్తి యాజమాన్యాన్ని పొందింది.