
Space Station: చైనా స్పేస్ స్టేషన్‌కు తొలి విదేశీ అతిథిగా పాక్ వ్యోమగామి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌పై ఒత్తిడి తేవడానికి పాకిస్థాన్ కు చైనా అన్ని రకాలుగా మద్దతు అందిస్తోంది. అదే సమయంలో తన స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా వినియోగించుకుంటోంది.
మిత్రదేశంగా వ్యవహరించుకుంటూనే, అవసరమైన సమయంలో పాక్ భూభాగాన్ని తన ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోంది.
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా అప్పుడప్పుడూ సహాయం అందిస్తూ, తమ నియంత్రణలో ఉంచుకునేలా వ్యూహాలు రచిస్తోంది.
Details
వ్యోమగాములను పంపించే ప్రక్రియ వేగవంతం
అంతరిక్ష రంగంలో ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో చైనా తన స్థానాన్ని కొనసాగిస్తోంది.
ఇప్పటికే రష్యా, అమెరికాలకు మాత్రమే స్వంత అంతరిక్ష కేంద్రాలు ఉండగా, చైనా ఇటీవల తియాంగాంగ్ అనే తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకొని, ఆ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
భారత్ కూడా స్వంత అంతరిక్షం కేంద్రం నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది.
తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకున్న చైనా, ఇప్పుడు తన వ్యోమగాములను పంపించే ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
కొన్నేళ్లుగా పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన చైనా, ఇప్పుడు మరింత ముందుకెళ్లి, పాక్‌కు చెందిన వ్యోమగాములను శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Details
తొలిసారిగా పాక్ వ్యోమగామి
ఇందులో భాగంగా, తొలిసారిగా తన అంతరిక్ష కేంద్రానికి విదేశీ అతిథిగా పాకిస్తాన్ వ్యోమగామిని పంపించాలని నిర్ణయించింది.
ఈ ఒప్పందానికి సంబంధించి చైనా మ్యాన్‌డ్ స్పేస్ ఏజెన్సీ (CMSA), పాకిస్తాన్ స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (SUPARCO) మధ్య ఇటీవల ఓ ఒప్పందం కుదిరింది.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ హాజరయ్యారు.
ప్రస్తుతం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో త్వరలోనే పాకిస్తాన్‌కు చెందిన వ్యోమగామి అడుగుపెట్టనున్నాడు.
చైనా అగ్రరాజ్యంగా ఎదిగే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, పాకిస్తాన్‌ను తాను చెప్పిన దిశలో నడిపించేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.