Lunar eclipse : హోలీ రోజున ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం..భారత్‌లో బ్లడ్ మూన్ కనిపిస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాదిలో మొదటి గ్రహణం మార్చి 14న హోలీ పండుగ రోజున సంభవించనుంది.
ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం.ఈ అరుదైన ఖగోళ సంఘటన ఆకాశంలో అలౌకిక దృశ్యాన్ని అందించనుంది.
దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది.
'బ్లడ్ మూన్'గా ప్రసిద్ధిగాంచిన ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు, భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
శాస్త్రవేత్తల ప్రకారం, ఈసారి భూమి నీడ చంద్రుడిని 99.1% వరకు కప్పేయనుంది.
ప్రపంచవ్యాప్తంగా, భౌగోళిక స్థితిని బట్టి ఇది పాక్షికంగా లేదా సంపూర్ణంగా కనిపించనుంది. చంద్రుని కక్ష్యలోని స్థానం ఆధారంగా గ్రహణ ప్రభావం మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వివరాలు
దాదాపు 6 గంటల పాటు గ్రహణ దశలు
భారత కాలమానం ప్రకారం,మార్చి 14న ఉదయం 9:29 గంటలకు గ్రహణం ప్రారంభమై,మధ్యాహ్నం 3:39 గంటలకు ముగియనుంది.
గ్రహణ గరిష్ట స్థాయికి మధ్యాహ్నం 12:29 గంటలకు చేరుకోనుంది.ఈ దశ ఉదయం 11:57 గంటలకు ప్రారంభమై,మధ్యాహ్నం 1:01 గంటలకు ముగుస్తుంది.
మొత్తం గ్రహణ దశలు దాదాపు 6 గంటల పాటు కొనసాగనున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
సాధారణంగా చంద్రగ్రహణాల సమయంలో చంద్రుడు కొంత వెడల్పుగా,తన సహజ రంగులో కనిపిస్తాడు.
కానీ 'బ్లడ్ మూన్' ఏర్పడినప్పుడు,చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులో మారిపోతాడు.
సూర్య కిరణాలు భూ వాతావరణం ద్వారా వ్యాపించి,చంద్రుడిపై పడే విధంగా మారుతాయి.
ఖగోళ శాస్త్రంలో దీనిని 'రేలీ స్కాటరింగ్' అని అంటారు.భూమి నీడ పూర్తిగా కప్పేయడం వల్ల చంద్రుడు ఈ ప్రత్యేక రంగులో మెరిసిపోతాడు.
వివరాలు
అమెరికాలో చాలా ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం
ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పశ్చిమార్థగోళంలోని చాలా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది.
అయితే, భారత్‌లో గ్రహణ సమయానికి పగలు కావడంతో మన దేశంలో ఇది కనిపించదు.
ఉత్తర, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, మరియు ఆఫ్రికాలోని ప్రజలు ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలరు.
ముఖ్యంగా, అమెరికాలో చాలా ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా దర్శనమివ్వనుంది.
ఐరోపాలో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం ముగియనుంది.
ఈ గ్రహణాన్ని టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ సహాయంతో మరింత స్పష్టంగా వీక్షించవచ్చు.
విద్యుత్ వెలుగుల ప్రభావం లేకుండా, కాలుష్యరహిత ప్రదేశాల్లో ఈ అద్భుత దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.