
#NewsBytesExplainer: సునామీ సమయంలో క్రూయిజ్ షిప్‌లో ఏమి జరుగుతుంది? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలో బుధవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం వల్ల పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా జపాన్, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో అలర్ట్‌లు వెలువడ్డాయి. కొన్నిచోట్ల పెద్ద పెద్ద అలలు కూడా తీరాన్ని తాకాయి.అయితే, ఓడ లేదా క్రూయిజ్ నౌక సముద్రంలో ఉన్నప్పుడు సునామీ వస్తే, అవి ఎందుకు మునిగిపోవు ? సునామీ వచ్చినప్పడు ఓడలు, క్రూయిజ్‌లలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు సురక్షితంగాఉంటారు? ఎప్పుడు ప్రమాదంలో మునిగిపోతారు? దీనివెనుక కారణం ఏంటో తెలుసా?
వివరాలు
భారీ ఓడలు,క్రూయిజ్ నౌకలు ఇలాంటి అలలకు ఎదిరించగలిగేలా నిర్మిస్తారు
సాధారణంగా సునామీ వచ్చినప్పుడు ఓడలో ఉన్నవారు ముప్పులోనే ఉన్నారని అనుకుంటారు. కానీ ఓడ లేదా నౌక ప్రమాదంలో పడతుందా లేదా అన్నది,అది సముద్రంలో ఎక్కడ ఉందన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఓడ సముద్రం మధ్యలో ఉంటే,అది సునామీ వల్ల మునిగిపోవాల్సిన అవసరం ఉండదు. లోతైన సముద్రంలో అంటే తీరానికి చాలా దూరంగా ఓడలు ప్రయాణిస్తున్నప్పుడు,సునామీ కారణంగా అవి మునిగిపోవడం జరగదు. ఎందుకంటే సునామీ అలలు ఓపెన్ ఓషన్‌లో చాలా వేగంగా..గంటకు వందల మైళ్ల రేటుతో - ప్రయాణిస్తాయి, కానీ అక్కడ అవి తక్కువ ఎత్తుతో కనిపిస్తాయి. ఈఅలలు సాధారణంగా 1 నుండి 2మీటర్ల వరకు ఎత్తు కలిగి ఉండొచ్చు లేదా మరింతగా పెరగొచ్చు. అయితే భారీ ఓడలు,క్రూయిజ్ నౌకలు ఇలాంటి అలలకు ఎదిరించగలిగేలా నిర్మించబడతాయి.
వివరాలు
తీరానికి దగ్గరగా ఉన్న ఓడల విషయంలో భిన్నం
ఇవిబలమైన నిర్మాణంతో ఉండే నౌకలు కావడంతో,అలల వల్ల కదిలే అవకాశం ఉన్నా, మునిగిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా కార్గోషిప్‌లు లేదా భారీక్రూయిజ్ నౌకలు తమ బరువు వల్ల కూడా అలల ప్రభావానికి తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. అలలు వీటిని కొన్నిఅంగుళాలు పైకీ కిందకీ నెట్టవచ్చు కానీ పూర్తిగా ముంచేయడం సాధ్యపడదు. అయితే,తీరానికి దగ్గరగా ఉన్న ఓడల విషయంలో భిన్నంగా ఉంటుంది.ఎందుకంటే సునామీఅలలు తీరానికి చేరే సమయంలో వాటి ఎత్తు చాలా రెట్టింపు అవుతుంది. కొన్ని సందర్భాల్లో 10 నుంచి 30 మీటర్ల వరకు కూడా చేరుతుంది.అలాంటప్పుడు సునామీ వేగవంతమైన అలలు దానిని ఢీకొట్టి పడగొట్టవచ్చు. అందుకే ఓడలు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు,అవి మునిగిపోయే ప్రమాదం తీరాల కంటే తక్కువగా ఉంటుంది.