LOADING...
Mira Murati: $1 బిలియన్ ఇస్తామన్న మెటా.. అయినా ఆమెను ఒక్క ఉద్యోగి కూడా విడిచిపెట్టలేదు! 
$1 బిలియన్ ఇస్తామన్న మెటా.. అయినా ఆమెను ఒక్క ఉద్యోగి కూడా విడిచిపెట్టలేదు!

Mira Murati: $1 బిలియన్ ఇస్తామన్న మెటా.. అయినా ఆమెను ఒక్క ఉద్యోగి కూడా విడిచిపెట్టలేదు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధిపత్యం పెరిగిన యుగం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణుల కోసం పోటీ పెరిగిన నేపథ్యంలో,టెక్‌ దిగ్గజాలు భారీ ఆఫర్లు ఇస్తూ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. కానీ ఓ ఏఐ స్టార్టప్‌ ఉద్యోగులు మాత్రం ఆ వలలో చిక్కలేదు. దాని బోర్డు లో సభ్యులుగా ఉన్న ఏఐ నిపుణులు, బహుళ అంతర్జాతీయ సంస్థల దాడుల నుంచి తప్పించుకుని తమ సీఎఫ్‌ఓమీద ఉన్న విశ్వాసంతో అక్కడే కొనసాగుతున్నారు. ఈ అసాధారణ సంఘటనకు నాయికగా నిలిచిన వ్యక్తి మీరా మురాటీ.

వివరాలు 

2025 ఫిబ్రవరిలో  "థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌" స్టార్టప్‌ 

2025 ఫిబ్రవరిలో మీరా మురాటీ స్థాపించిన "థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌" అనే స్టార్టప్‌ ప్రస్తుతం టెక్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. మెటా, మిస్ట్రాల్‌, ఓపెన్‌ఏఐ వంటి అగ్రగామి కంపెనీల్లో కీలక పాత్రలు పోషించిన 30 మంది ప్రముఖ ఏఐ నిపుణులను మీరా తమ సంస్థకు తీసుకొచ్చారు. అంతటి ప్రఖ్యాతి గల నిపుణులు పనిచేస్తుండటంతో, ఫేస్‌బుక్‌ పేమరినింగ్‌ సంస్థ అయిన మెటా దృష్టి ఈ సంస్థపై పడింది. వారి టాలెంట్‌ను తమవైపు తిప్పుకునేందుకు మెటా గాలం వేయడం ప్రారంభించింది. ఒక్కో ఉద్యోగికి 200 మిలియన్‌ డాలర్ల (సుమారు ₹1,750 కోట్లు) నుంచి 500 మిలియన్‌ డాలర్ల (₹4,375 కోట్లు) వరకు భారీ ఆఫర్లు ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాలు 

ఒక ఉద్యోగికి మెటా ఏకంగా 1 బిలియన్‌ డాలర్ల ఆఫర్ 

ఇంతేకాదు.. ఒక ఉద్యోగికి మెటా ఏకంగా 1 బిలియన్‌ డాలర్లు (సుమారు ₹8,755 కోట్లు) ఇవ్వడానికి కూడా సిద్ధమైందట! అంతేకాదు, వ్యక్తిగతంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా కొంతమందితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కానీ, ఆ సంస్థలోని ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈ వలలో చిక్కుకోలేదు. సంస్థ తరపున మీరా మురాటీ నేతృత్వంపై ఉన్న నమ్మకంతో,వారు ఏఐ ప్రపంచంలో అత్యంత విశ్వాసానికి అర్థం చూపించినట్లయింది. ఆసక్తికరంగా ఏమిటంటే..ఈ సంస్థ ఇప్పటిదాకా ఒక్క ఉత్పత్తినైనా మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. అయినప్పటికీ, మురాటీపై సిబ్బంది చూపిన అచంచలమైన విశ్వాసం,ఈ స్టార్టప్‌ను సుస్థిరంగా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్‌ విలువ దాదాపు 12 బిలియన్‌ డాలర్లుగా(సుమారు ₹1లక్ష 5వేల కోట్లు) ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

మీరా మురాటీ ఎవరు? 

మీరా మురాటీ అల్బేనియాలోని వ్లోర్‌ అనే చిన్న పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తిచేసిన ఆమె, తన 16వ ఏట ఉన్నత విద్య కోసం కెనడాకు వలస వెళ్లారు. వాంకోవర్ ఐలాండ్‌లో ఉన్న ఓ విద్యాసంస్థలో చదువుకున్నారు. 2011లో గోల్డ్‌మన్ శాక్స్‌ సంస్థలో ఇంటర్న్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం టెస్లా సంస్థలో మూడేళ్ల పాటు పనిచేశారు. అక్కడ ఆమె "మోడల్ ఎక్స్" అనే ఈవీ కారు ప్రాజెక్ట్‌లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత, వర్చువల్ రియాలిటీ రంగంలో పనిచేసే "లీప్ మోషన్" సంస్థలో రెండేళ్లు పని చేశారు.

వివరాలు 

మీరా మురాటీ ఎవరు? 

అక్కడ ఆమె కృత్రిమ మేధను వాస్తవ జీవిత సంఘటనలతో మేళవించే ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ అనుభవాలన్నీ, ఏఐపై ఉన్న ఆసక్తిని మరింత పెంచాయని ఆమె ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ ఆసక్తి కారణంగానే, 2018లో ఆమె ఓపెన్‌ఏఐలో చేరారు. సంస్థలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ, చివరకు "చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్" (CTO) స్థాయికి ఎదిగారు. ఓ దశలో తాత్కాలిక సీఈఓ బాధ్యతలు కూడా నిర్వహించారు. చివరకు, 2024 చివరిలో ఓపెన్‌ఏఐకి వీడ్కోలు చెప్పి, తనదైన దారిలో ప్రయాణించేందుకు "థింకింగ్ మెషిన్స్ ల్యాబ్"ను స్థాపించారు.