LOADING...
Telegram: టెలిగ్రామ్‌కు షాక్.. దర్యాప్తు ప్రారంభించిన యూకే
టెలిగ్రామ్‌కు షాక్.. దర్యాప్తు ప్రారంభించిన యూకే

Telegram: టెలిగ్రామ్‌కు షాక్.. దర్యాప్తు ప్రారంభించిన యూకే

వ్రాసిన వారు Moogati Shabari
Apr 22, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌లో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్ పై కీలక దర్యాప్తు ప్రారంభమైంది. యూకే కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ అయిన ఆఫ్‌కామ్ ఈ విచారణను చేపట్టింది. ఈ దర్యాప్తు ప్రధానంగా పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (CSAM) షేరింగ్‌ను ఆపడంలో టెలిగ్రామ్ విఫలమవుతోందా అనే అంశంపై దృష్టి సారించింది. యూకే ఆన్‌లైన్ సేఫ్టీ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఈ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లో ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కెనడాకు చెందిన కెనడియన్ సెంటర్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ అందించిన ఆధారాలు నిలిచాయి. ఈ దర్యాప్తు వివరాలపై మాట్లాడిన ఆఫ్‌కామ్ అమలు విభాగం డైరెక్టర్ సుజాన్ కేటర్, పిల్లలపై లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టడం తమ అత్యంత ప్రాధాన్య అంశాల్లో ఒకటని స్పష్టం చేశారు.

వివరాలు

ఆ కంటెంట్ తొలగించాలని సూచన..

ఇదిలా ఉంటే ఏఐ ఫోరెన్సిక్ విడుదల చేసిన నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో 24,671 మంది టెలిగ్రామ్ వినియోగదారులు అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలు, అలాగే CSAM కంటెంట్‌ను యాక్టివ్‌గా షేర్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ కంటెంట్‌ను ఎక్కువగా యువ హెటెరోసెక్సువల్ పురుషులు డబ్బు కోసం విక్రయిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఛానెల్‌ ద్వారా ఒకేసారి ఫీజు లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూపంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఏఐ ఫోరెన్సిక్ కు చెందిన సిల్వియా సెమెంజిన్, ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని రెగ్యులేటర్లను కోరారు. టెలిగ్రామ్‌ను చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేసేలా చేసి, అక్రమ కంటెంట్ షేరింగ్ ఛానెల్‌లను వెంటనే తొలగించాలని సూచించారు.

వివరాలు

భారీ జరిమానా తప్పదు..

యూకేలో అమల్లో ఉన్న యూకే ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, యూజర్ టు యూజర్ సేవలు అందించే సంస్థలు అక్రమ కంటెంట్‌ను నియంత్రించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆఫ్కామ్ గరిష్టంగా 18 మిలియన్ లేదా కంపెనీ గ్లోబల్ ఆదాయంలో 10 శాతం వరకు జరిమానా విధించే అధికారం కలిగి ఉంది. తీవ్ర పరిస్థితుల్లో కోర్టులు.. ప్రకటనదారులు, చెల్లింపు సేవలు అందించే సంస్థలు ఆ ప్లాట్‌ఫామ్‌తో సంబంధాలు నిలిపివేయాలని ఆదేశించవచ్చు. అంతేకాదు, యూకేలో ఆ సేవను పూర్తిగా బ్లాక్ చేయించే అవకాశం కూడా ఉంది.

Advertisement

వివరాలు

ఆ ఆరోపణలు ఖండించిన టెలిగ్రామ్..

ఇదిలా ఉంటే ఈ ఆరోపణలను టెలిగ్రామ్ పూర్తిగా ఖండించింది. 2018 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో CSAM పబ్లిక్‌గా వ్యాప్తి చెందడాన్ని డిటెక్షన్ అల్గారిథమ్‌ల ద్వారా దాదాపుగా పూర్తిగా అరికట్టామని కంపెనీ వెల్లడించింది. ఈ దర్యాప్తు తనకు ఆశ్చర్యం కలిగించిందని, అలాగే ఇది స్వేచ్ఛా భావ వ్యక్తీకరణ, ప్రైవసీ హక్కులను ప్రోత్సహించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై పెద్ద ఎత్తున జరుగుతున్న దాడిలో భాగమై ఉండొచ్చని టెలిగ్రామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే టెలిగ్రామ్‌లో నిషేధిత కంటెంట్ వైరల్ అవుతోందని పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు నివేదించారు.

Advertisement