
Shardul Thakur : ఒకే ఓవర్‌లో 11 బాల్స్! శార్దూల్ ఠాకూర్ కంటే ముందు ఎవరున్నాంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. టైటిల్ ఫేవరెట్‌గా భావించిన ముంబయి ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రం వరుస ఓటములతో వెనుకబడి పోయాయి.
అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మంచి విజయాలతో ముందుకు దూసుకుపోతున్నాయి.
తాజాగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మధ్య జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఒక చెత్త రికార్డును నెలకొల్పాడు. అతను ఐపీఎల్ చరిత్రలో 11 బంతులతో ఓవర్ వేసిన అరుదైన ఘనత సాధించాడు.
Details
Bg
కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో శార్దూల్ ఐదు వరుస వైడ్ బంతులు, మొత్తంగా ఆ ఓవర్‌లో ఆరు వైడ్లు వేసాడు.
మొత్తం 11 బంతులు వేసిన అతను ఆ ఓవర్‌లో చివరి బంతికి కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేయడం విశేషం.
అతను నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో 11 బంతుల ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో శార్దూల్ ఇప్పుడు చేరిపోయాడు.
ఈ జాబితాలో ఉన్నవారు
తుషార్ దేశ్‌పాండే (సీఎస్‌కే) - 2023లో లక్నోపై
మహ్మద్ సిరాజ్ (ఆర్సీబీ) - 2023లో ముంబైపై
శార్దూల్ ఠాకూర్ (ఎల్ఎస్‌జీ) - 2025లో కోల్‌కతాపై
Details
4 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమి
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.
మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 81, నికోలస్ పూరన్ 36 బంతుల్లో 87 పరుగులతో విజృంభించారు.
కేకేఆర్ బౌలింగ్‌లో హర్షిత్ రాణా 2 వికెట్లు తీసాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రహానే 35 బంతుల్లో 61, వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 45, రింకూ సింగ్ 15 బంతుల్లో 38 నాటౌట్‌గా రాణించారు. లక్నో బౌలింగ్‌లో ఆకాష్ దీప్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు.