Page Loader
WI vs AUS: వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు.. విలవిలాడిన ఆసీస్ బ్యాటర్స్..!
వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు.. విలవిలాడిన ఆసీస్ బ్యాటర్స్..!

WI vs AUS: వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు.. విలవిలాడిన ఆసీస్ బ్యాటర్స్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలాడారు. బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 180 పరుగులకే కుప్పకూలిపోయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు 57 పరుగుల వద్దే నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. విండీస్ బౌలర్ షమార్ జోసెఫ్ పేస్‌తో చెలరేగి ఆసీస్ టాపార్డర్‌ ను పెవిలియన్‌కు పంపించాడు. అతడు 16 ఓవర్లు వేసి కేవలం 46 పరుగులకే నాలుగు కీలక వికెట్లు తీయడం విశేషం.

వివరాలు 

జైడెన్ సీల్స్ 5 వికెట్లు

జోసెఫ్ ఈ అద్భుత ప్రదర్శనతో తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో తీసిన ఏడు వికెట్ల ఘనతను మరోసారి గుర్తు చేశాడు.మరోవైపు జైడెన్ సీల్స్ 5 వికెట్లను తీసి ఆస్ట్రేలియా పతనానికి కారకుడయ్యాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో.. ఉస్మాన్ ఖవాజా 47 పరుగులు,ట్రావిస్ హెడ్ 59 పరుగులతో కొంత పోరాడినా.. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా సాధించలేక పోయారు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 18 బంతుల్లో 28 పరుగులు చేయడం వలన జట్టు స్కోరు కొద్దిగా మెరుగైంది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై ఆసీస్ పేసర్లు మొదటి నుంచే దాడి మొదలుపెట్టారు.

వివరాలు 

విండీస్ 57/4

మిచెల్ స్టార్క్ బ్రాత్‌వైట్,జాన్ క్యాంప్‌బెల్ లను ఔట్ చేయగా,ప్యాట్ కమిన్స్ కార్టీని, జోష్ హేజల్‌వుడ్ జోమెల్ వారికన్‌ను పెవిలియన్‌ బాట పట్టించారు. ఫలితంగా విండీస్ 57/4 పరుగుల వద్ద కష్టాల్లో కూరుకుంది. ప్రస్తుతం బ్రాండన్ కింగ్, కెప్టెన్ రోస్టన్ చేస్ క్రీజులో ఉన్నారు. విండీస్ జట్టు 22 సంవత్సరాల తర్వాత తమ సొంత గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించాలనే లక్ష్యంతో నిలిచింది. మ్యాచ్ రెండో రోజు వీరి ఆటే మ్యాచ్ దిశను మార్చనుంది.