బీసీసీఐకి 230 మిలియన్ డాలర్లు.. అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ క్రికెట్ బోర్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఇటీవలే తన కొత్త రెవెన్యూ మోడల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఐసీసీలో ఉన్న 600 మిలియన్ల డాలర్ల నుంచి బీసీసీఐకి 230 డాలర్లు కేటాయించారు. దీంతో ఐసీసీ నుంచి 38.5శాతం వాటను బీసీసీఐ పొందింది.
అంత మొత్తాన్ని కేవలం బీసీసీఐకి ఎలా చెల్లిస్తారని పాక్ క్రికెట్ బోర్డు అగ్రహం వ్యక్తం చేసింది.
అయితే 2024-27 సీజన్ కోసం ఈ ఆదాయ కేటాయింపులు జరిగాయి. ఇందులో పీసీబీకి 5.75శాతం వాటా దక్కింది.
దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు రెండింతలు ఆదాయం పెరిగినా బీసీసీఐకి ఎక్కువ ఆదాయం రావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
Details
పాక్ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ సభ్యులు
ముఖ్యంగా ఐసీసీ అమలు చేసిన రెవెన్యూ షేరింగ్ విధానం సరిగా లేదని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
అదే విధంగా రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమోదించేందుకు ఓటింగ్ ప్రక్రియ చేపట్టాలని పీసీబీ కోరింది. కానీ ఐసీసీ సభ్యులు మాత్రం పాక్ అభ్యర్థనను తిరస్కరించారు.
త్వరలోనే ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ కు చెందిన షెడ్యూల్‌ను వెల్లడించనున్నట్లు పీసీసీ తెలిపింది.
ఇక ఇంగ్లండ్ బోర్డుకు 41 మిలియన్ డాలర్లు (6.89 శాతం), ఆస్ట్రేలియాకు 37.5 మిలియన్ డాలర్లు (6.25 శాతం) చెల్లించనున్నారు.