Page Loader
IND Vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. పెర్త్ టెస్ట్‌కు 'వెటోరి' దూరం
ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. పెర్త్ టెస్ట్‌కు 'వెటోరి' దూరం

IND Vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. పెర్త్ టెస్ట్‌కు 'వెటోరి' దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25, నవంబర్ 22న ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఈ హైవోల్టేజ్ సిరీస్‌కు మొదటి టెస్టు పెర్త్‌ వేదికగా జరుగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో కొనసాగేందుకు ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకంగా మారింది. అందుకే తొలి టెస్టులో విజయంతో సిరీస్‌పై ఆధిపత్యం సాధించేందుకు రెండు జట్లు ఇప్పటికే ప్రణాళికలు రచించాయి. ఇక పెర్త్ టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండకపోవడం పెద్ద దెబ్బగానే కనిపిస్తోంది. అయితే ఆస్ట్రేలియా జట్టుకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరి ఐపీఎల్ 2025 మెగా వేలం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నారు.

Details

టెస్టు

డానియల్ వెటోరి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో జడ్డాలో జరిగే మెగా వేలానికి వెటోరి హాజరుకానున్నారు. తొలి టెస్టుకు దూరమవుతున్నట్లు ఇప్పటికే వెటోరి ప్రకటించారు. వెటోరి ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు తమకు సమాచారం ఇచ్చారని, అతని నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని వేలం ముగిసిన తర్వాత అతను జట్టుతో చేరుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి పేర్కొన్నారు. తొలి టెస్టులో కీలక వ్యక్తుల గైర్హాజరు పట్ల ఇరు జట్ల ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు రోహిత్ శర్మ లేని టీమిండియా, మరోవైపు వెటోరి లేని ఆస్ట్రేలియా రెండు జట్లూ తొలి మ్యాచ్‌లో విజయాన్ని సాధించేందుకు కొత్త వ్యూహాలతో బరిలోకి దిగనున్నాయి.