Page Loader
Keshav Maharaj: రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ప్రత్యేక శుభాకాంక్షలు 
Keshav Maharaj: రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ప్రత్యేక శుభాకాంక్షలు

Keshav Maharaj: రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ప్రత్యేక శుభాకాంక్షలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2024
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్యలో సోమవారం జరగనున్న రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ'వేడుక కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయోధ్యలో రామ్ లల్లా వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి భారత క్రీడాకారులతో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. వేడుకకు ముందురోజు, దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ భారతదేశానికి తన శుభాకాంక్షలను తెలియజేసారు.దేశంలో శాంతి, సామరస్యం కోసం ప్రార్థించారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో మహరాజ్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆవీడియో లో మహారాజ్ మాట్లాడుతూ.. "నమస్తే,నేను ఇక్కడ దక్షిణాఫ్రికాలో ఉన్న నా భారతీయ సమాజానికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను.రేపు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు.ఈ ప్రాణ ప్రతిష్ట శాంతిని తేవాలని కోరుకుంటున్నాను.. జై శ్రీ రామ్."

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ'పై మాట్లాడుతున్న కేశవ్ మహారాజ్ 

Details 

ఉత్తరప్రదేశ్‌ చేరుకున్న భారత దిగ్గజ బౌలర్స్ 

ఈ నెల ప్రారంభంలో, మహరాజ్ భారత్‌తో జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు "రామ్ సియా రామ్ జై జై రామ్" పాటను ప్లే చేయమని DJని అభ్యర్థించాడు. "ఆ పాటను ప్లే చేయమని నేను ఓ మీడియాకి సంభందించిన మహిళను అభ్యర్థించాను" అని మహారాజ్ PTI కి చెప్పారు. 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు ఇండియన్ క్రికెట్ టీం నుండి ఇప్పటికే భారత దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ వేడుకలకు హాజరయ్యేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య చేరుకున్నారు. వీరితో బాటు MS ధోని, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, రవిచంద్రన్ అశ్విన్‌లను హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందుకున్నారు.