Abhishek Sharma: మరో 16 పరుగులు చేస్తే.. అభిషేక్ శర్మకు అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమైంది. ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. టీ20 ఫార్మాట్‌లో ఇటీవల వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయిన భారత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. వీరిద్దరూ రాణిస్తే భారత జట్టు విజయావకాశాలు మరింత బలపడతాయి. ఇదిలా ఉండగా, అభిషేక్ శర్మ ఓ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 16 పరుగులు సాధిస్తే టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మార్క్‌ను అందుకుంటాడు. ఈ ఘనతను 200 కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సాధించిన నాలుగో భారతబ్యాటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు.
వివరాలు
162 ఇన్నింగ్స్‌ల్లోనే అరుదైన ఘనత..
ప్రస్తుతం అభిషేక్ శర్మ 203 మ్యాచ్‌ల్లో 199 ఇన్నింగ్స్‌లు ఆడి 5,984 పరుగులు చేశాడు.
వీటిలో 53 మ్యాచ్‌లు టీమిండియా తరఫున ఆడగా, మిగతా పరుగులను దేశీయ, ఫ్రాంచైజీ టీ20 టోర్నీల్లో నమోదు చేశాడు.
ఈ జాబితాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 166 ఇన్నింగ్స్‌ల్లోనే 6,000 టీ20 పరుగులు పూర్తి చేశాడు.
అనంతరం విరాట్ కోహ్లీ 184 ఇన్నింగ్స్‌ల్లో, శుభ్‌మన్ గిల్ 185 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా టీ20ల్లో అత్యంత వేగంగా 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా వెస్టిండీస్ దిగ్గజం, 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ నిలిచాడు.
అతడు కేవలం 162 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.