LOADING...
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. తొలి భారత క్రికెటర్‌గా సూపర్ ఫీట్
తొలి భారత క్రికెటర్‌గా సూపర్ ఫీట్

Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. తొలి భారత క్రికెటర్‌గా సూపర్ ఫీట్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దూకుడు, ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. "మిస్టర్ 360" సూర్యకుమార్ యాదవ్ కూడా ఆశ్చర్యపోయే విధంగా హిట్టింగ్‌లో అభిషేక్ దిట్ట. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ (193.50) కలిగిన బ్యాటర్‌ అతడే. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అతను అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇలా అనతికాలంలోనే టాప్‌ ర్యాంక్‌కు చేరుకోవడానికి కారణం అతడి బ్యాటింగ్‌ ప్రదర్శనే. ఇక తాజాగా అభిషేక్ శర్మ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున సూపర్ ఫీట్ సాధించి, తొలి భారత ఆటగాడిగా ఈ రికార్డును సృష్టించారు.

వివరాలు 

లక్ష్య ఛేదన ప్రారంభమైన మొదటి బంతికి సిక్స్ కొట్టిన తొలి భారత బ్యాటర్‌

ఆసియా కప్‌లో యూఏఈ (IND vs UAE) తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో,మరో 93 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 57 పరుగులకే ఆలౌటైంది.లక్ష్య ఛేదనలో భారత్ వేగంగా పరుగులు ఆడేసింది. అభిషేక్ శర్మ తన చిన్ననాటి స్నేహితుడు శుభమన్ గిల్ (20*)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించారు. అభిషేక్ 16 బంతుల్లో 30 పరుగులు చేసి 2 ఫోర్లు,3 సిక్స్‌లు కొట్టారు.ముఖ్యంగా యూఏఈ బౌలర్ హైదర్ అలీ వేసిన తొలి బంతిని సిక్స్‌గా మలిచాడు. ఈ మ్యాచ్‌తో అభిషేక్ టీ20ల్లో లక్ష్య ఛేదన ప్రారంభమైన మొదటి బంతికి సిక్స్ కొట్టిన తొలి భారత బ్యాటర్‌ కావడం గమనార్హం

వివరాలు 

తొలి బ్యాటింగ్ సమయంలో  మొదటి బంతికి సిక్స్ కొట్టిన బ్యాట్సమెన్ 

గతంలో ఇంగ్లాండ్‌పై రోహిత్ (2021), జింబాబ్వేపై యశస్వి జైస్వాల్ (2024), ఇంగ్లాండ్‌పై సంజు సాంసన్ (2025) మొదటి బంతికి సిక్స్ కొట్టారు. అయితే, వీరు సాధించిన ఫీట్ టీమ్‌ఇండియా తొలి బ్యాటింగ్ సమయంలో మాత్రమే జరిగింది.