AFG vs PAK: ఆఫ్గాన్ విజయం.. తుపాకుల మోత మోగించిన తాలిబన్లు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. పసికూన జట్లు పెద్ద జట్లను చిత్తు చేసి సంచనాలను నమోదు చేస్తున్నాయి. నెదర్లాండ్స్ జట్టు సఫారీ జట్టుపై విజయం సాధించగా, తాజాగా ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లను ఆఫ్ఘనిస్తాన్ మట్టికరిపించింది. సోమవారం చైన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఆఫ్గాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్గాన్ దేశంలో సంబరాలు మిన్నంటాయి. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే అమెరికా సేనలు అక్కడి నుంచి వెళ్లిపోయారో అప్పటి నుంచి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసిన తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
సంబరాల్లో మునిగిపోయిన ఆఫ్గాన్ ప్రజలు
పాకిస్థాన్ పై విజయం సాధించగానే ఆఫ్గాన్ తమదైన స్టైల్‌లో సంబరాలను చేసుకుంది. ఆఫ్గాన్ ప్రజలు బాణాసంచా కాలిస్తే, తాలిబన్లు మాత్రం తుపాకుల మోత మోగించారు. ఆకాశం వైపు తుపాకీ గురిపెట్టి బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.