ODI World Cup 2023: ఆప్ఘనిస్తాన్ ఓడినా సెమీస్‌కు వెళ్లే అవకాశం.. ఒక స్థానానికి మూడు జట్లు పోటీ..!
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా సంచలన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచులో ఆప్ఘనిస్తాన్ ఓడినా సెమీస్ వెళ్లడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నాలుగో స్థానం కోసం మూడు జట్ల మధ్య రసరత్తర పోటీ నెలకొంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో పాకిస్థాన్, ఆరో స్థానంలో ఆప్ఘనిస్తాన్ జట్లు నిలిచాయి. ఇక న్యూజిలాండ్‌తో శ్రీలంక, పాకిస్థాన్‌తో ఇంగ్లండ్, ఆప్ఘనిస్తాన్‌తో ధక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
సౌతాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయం సాధించాలి
ఒకవేళ సౌతాఫ్రికాపై ఆఫ్ఘాన్ గెలిచి, బంగ్లాపై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే రెండో ప్లేస్ లోకి ఆస్ట్రేలియా వెళ్తుంది. ఇక రెండు జట్లు తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధిస్తే రన్ రేట్ ప్రకారం రెండు, మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు నిలిచే అవకాశం ఉంటుంది. కావున ఈ జట్లు నెట్ రన్ రేట్ ఎక్కువగా సాధించాలంటే భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. సౌతాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయం సాధించి, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తర్వాతి మ్యాచుల్లో ఓడిపోతే ఆఫ్ఘాన్ సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.