NED vs AFG: నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం
ఈ వార్తాకథనం ఏంటి
సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు షాకిచ్చిన నెదర్లాండ్స్ బ్యాటర్లు కీలక మ్యాచులో చేతులెత్తేశారు.
ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ ఓటమిపాలైంది.
లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదటగా నెదర్లాండ్స్ 179 పరుగులకే కుప్పకూలింది. నెదర్లాండ్స్ కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఐదో బంతికి వెస్లీ బ్యారేసి(3) పెవిలియానికి చేరాడు.
తర్వాత ఓడౌడ్(42), అకెర్ మాన్(29) రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.
ఈ సమయంలో ఆ జట్టుకు వరుస రనౌట్లు కొంపముంచాయి.
ఓడౌడ్, అకెర్ మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, ఎంగిల్ బ్రెట్జ్ రూపంలో నలుగురు రనౌట్ కావడంతో డచ్ జట్టు స్వల్ప స్కోరుకే చాప చూట్టేసింది.
ఎంగిల్ బ్రెట్జ్(58) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు.
Details
రాణించిన ఆప్ఘాన్ బ్యాటర్లు
ఆప్ఘన్ బౌలర్లలో మహ్మద్ నబీ 3, నూర్ అహ్మద్ 2, ముజీబ్ ఒక వికెట్ తీశారు.
లక్ష్య చేధనలో అప్ఘాన్ బ్యాటర్లు చక్కగా రాణించారు.
రెహ్మత్ షా(52), కెప్టెన్ హస్మతుల్లా షాహిది (56*) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు.
దీంతో ఆ జట్టు 31.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
రహ్మతుల్లా గుర్బాజ్(10), ఇబ్రహీం జద్రాన్(20) అజ్మతుల్లా ఒమర్జాయ్ (31*) రన్స్ చేశారు.
నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, సాకిబ్ జుల్ఫికర్ తలా ఓ వికెట్ తీశారు.