Virat Kohli: పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విరాట్ .. 'నువ్వే దిక్కు' మాజీ బ్యాటింగ్ కోచ్ వద్దకు
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ ఆదేశాల మేరకు టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ బాట పట్టారు.
ఇప్పటికే రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రంజీ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు.
ఇదే క్రమంలో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ కూడా జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌తో రంగప్రవేశం చేయనున్నాడు.
ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న కోహ్లీ ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత అతను రంజీలో ఆడబోతున్నాడు.
వివరాలు
ఫామ్ కోసం ప్రయత్నాలు
కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఇ
టీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన ఆఫ్‌సైడ్ బలహీనతను అధిగమించలేక, పదేపదే ఒకే రకంగా ఔట్ కావాల్సి వచ్చింది.
మొత్తం 9 ఇన్నింగ్స్‌లలో 23.75 సగటుతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు, అందులో ఒక సెంచరీ ఉంది.
ఈ పరిస్థితిలో తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సాయాన్ని కోరాడు. బంగర్ సూచనలతో కోహ్లీ తన బలహీనతలను అధిగమించేందుకు కృషి చేస్తున్నాడు.
వివరాలు
శిక్షణ శిబిరంలో కోహ్లీ
ఆదివారం కోహ్లీ బంగర్ సమక్షంలో ప్రత్యేక శిక్షణ శిబిరంలో సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోల్లో కోహ్లీ బ్యాక్‌ఫుట్‌పై ఆడుతున్నట్లు కనిపించాడు. సిమెంట్ పిచ్‌పై బ్యాక్‌ఫుట్ షాట్లు, స్క్వేర్ ఆఫ్ ద వికెట్ షాట్లను ప్రాక్టీస్ చేశాడు.
బంగర్ బంతులు విసురుతుండగా, కోహ్లీ బ్యాటింగ్ సాధన చేశాడు.
కోచ్ బంగర్‌తో గత అనుభవాలను గురించి కోహ్లీ ఒక సందర్భంలో "ఫామ్ కోల్పోయినప్పుడు బంగర్ ఇచ్చిన సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి" అని తెలిపాడు.
వివరాలు
అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించకున్నా..
అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా రాణించలేకపోయిన బంగర్, టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా (2014-2019) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రధాన కోచ్‌గా (2021-2023) సేవలందించాడు.
ఈ క్రమంలోనే కోహ్లీతో బంగర్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు రంజీ మ్యాచ్ ముందు కోహ్లీ ఫామ్‌ను తిరిగి తెచ్చుకునేందుకు బంగర్ సాయాన్ని పొందుతున్నాడు.
రంజీ మ్యాచ్ ప్రత్యేకతలు
రంజీ ట్రోఫీలో జనవరి 30న ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌కు 10,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరవుతారని ఢిల్లీ క్రికెట్ సంఘం అంచనా వేస్తోంది. మరో విశేషం ఏమిటంటే, ఈ మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చని కూడా ప్రకటించారు.