Page Loader
Akash Deep: టెస్ట్ క్యాప్ తీసుకున్న తర్వాత తల్లి పాదాలను తాకిన ఆకాశ్ దీప్.. వీడియో వైరల్!
టెస్ట్ క్యాప్ తీసుకున్న తర్వాత తల్లి పాదాలను తాకిన ఆకాశ్ దీప్.. వీడియో వైరల్!

Akash Deep: టెస్ట్ క్యాప్ తీసుకున్న తర్వాత తల్లి పాదాలను తాకిన ఆకాశ్ దీప్.. వీడియో వైరల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2024
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ నాలుగో మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. శుక్రవారం టాస్‌కు ముందు ఆకాష్‌కి భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన టెస్ట్ క్యాప్‌ను అందజేశారు. ఆపై ఆకాశ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఈ మ్యాచ్ నుండి విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా స్థానంలో రైట్ ఆర్మ్ పేసర్ ఆకాష్‌ వచ్చాడు. ఆకాష్‌ దీప్‌ భారత్‌ తరఫున ఆడుతున్న 313వ టెస్టు క్రికెటర్‌ అయ్యాడు. మునుపటి టెస్ట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌తో జరిగిన మాదిరిగానే, ఆకాష్ దీప్ క్యాప్ అందుకున్న తరువాత తన తల్లికి పాదాభివందనం చేశాడు. ఆకాష్ దీప్ తన కుటుంబంతో కలిసి ఫోటోలు దిగాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాంచీలో ఆకాశ్ దీప్ అరంగేట్రం ఫొటోస్ ఇవే..