Page Loader
టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన అలిస్సా హీలీ 
టీ20ల్లో 2500 పరుగులు చేసిన అలిస్సా హీలీ

టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన అలిస్సా హీలీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2023
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్ అలిస్సా హీలీ టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచులో 37 పరుగులు సాధించిన హీలీ టీ20ల్లో 2500 పరుగులు చేసిన మహిళా ప్లేయర్‌గా రికార్డుకెక్కింది. దీంతో ఈ మార్కును అధిగమించిన రెండో మహిళా ప్లేయర్ గా నిలిచింది. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ 3 పరుగుల తేడాతో గెలవడంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇప్పటివరకూ హీలీ 143 టీ20 మ్యాచుల్లో 24.33 సగటుతో 2,531 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 14 హఫ్ సెంచరీలున్నాయి.

Details

ఆస్ట్రేలియాపై విజయం సాధించిన ఇంగ్లాండ్

హీలీ టీ20 ఫార్మాట్లో 2,500 పరుగులు చేసిన 10వ ప్లేయర్‌గా నిలిచింది. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 3,820, లానింగ్ (ఆస్ట్రేలియా) 3,405, స్టాఫనీ టేలర్ (వెస్టిండీస్) 3,166, హర్మన్‌పీత్ కౌర్ (ఇండియా) 3,058, సోఫీ డివైన్ (న్యూజిలాండ్) 2,569, బిస్మాహ్ మహరూఫ్ (పాకిస్తాన్) 2,658 తర్వాత ఆమె నిలిచింది. మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్ తరుపున డేనియల్ వ్యాట్ 76 పరుగులతో రాణించి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.