Page Loader
Hardhik Pandya-Ambani-Ipl: హార్థిక్ పాండ్యాకు అంబానీ ఫ్యామిలీ వార్నింగ్...గెలవకపోతే కెప్టెన్సీ హుష్ కాకే
ముంబై ఇండియన్స్​ కెప్టెన్​ హార్థిక్​ పాండ్యా

Hardhik Pandya-Ambani-Ipl: హార్థిక్ పాండ్యాకు అంబానీ ఫ్యామిలీ వార్నింగ్...గెలవకపోతే కెప్టెన్సీ హుష్ కాకే

వ్రాసిన వారు Stalin
Apr 24, 2024
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై ఇండియన్స్(Mumbai Indians)కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు అంబానీ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చింది. ఐపీఎల్(IPL)సీజన్లో ముంబై ఇండియన్స్ కు మిగిలి ఉన్న మ్యాచ్ లను కచ్చితంగా గెలవాలని జట్టు యాజమాన్యం అల్టిమేటం జారీ చేసింది. ముంబై ఇండియన్స్ ఆడాల్సిన మిగతా 6 మ్యాచ్ లలో కనీసం ఐదింటిని గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్ కు అవకాశాలుంటాయి. దీంతో ఎలాగైనా ముంబయి ఇండియన్స్ జట్టును మిగతా మ్యాచ్ ల్లో గెలిపించాల్సిందిగా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం సూచించింది. ఐపీఎల్ సీజన్ కోసం ముంబయి ఇండియన్స్ టీం యాజమాన్యం హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

MI-Hardhik Pandya-Ambani

ప్లే ఆఫ్​ కు చేరకపోతే అంతే సంగతులు

ముంబై ఇండియన్స్ టీం ఈ సీజన్లో మొత్తం ఎనిమిది మ్యాచ్ ఆడి మూడు మ్యాచ్ లను మాత్రమే గెలిచింది. ఆ తరువాత ఆడిన ఐదు మ్యాచ్ లో ముంబై జట్టు ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో ముంబై ఇండియన్స్ క్రికెట్​ జట్టు ఆరు పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది. ఇప్పటికీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతంతమాత్రంగానే సాగుతోంది. కనీసం ప్లే ఆఫ్ కు కూడా ముంబయి ఇండియన్స్ జట్టును హార్దిక్ పాండ్యా చేర్చకపోతే అతడి కెప్టెన్సీ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.