Page Loader
ప్రజా సేవ చేయాలని ఉంది.. త్వరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అంబటి రాయుడు
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు

ప్రజా సేవ చేయాలని ఉంది.. త్వరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అంబటి రాయుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2023
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఏపీ సీఎం వైస్ జగన్‌తో రాయుడు భేటీ కావడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో రాయుడు గంటూరులో రాజకీయ రంగ ప్రవేశం‌పై క్లారిటీ ఇచ్చాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించిన అతను అమీనాబాద్‌లోని మూలంకురేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అతను అకాంక్షించాడు. అనంతరం తాను రాజకీయాల్లో వస్తున్నట్లు కన్ఫామ్ చేశాడు.

Details

జనం నాడి తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటన

గ్రామీణుల సమస్యలు, అవసరాలను తెలుసుకొని వాటిలో ఏ పనులు చేయగలను, ఏ అవసరాలను తీర్చగలను అనే అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చాక రాజకీయాల్లోకి వస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశారు. ప్రజా సేవకు వెళ్లే ముందు జనం నాడి తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నానని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే అంబటి రాయుడు గుంటూరు జిల్లాకు చెందినవాడు. అక్కడ క్రికెటర్‌గా ఎదిగి తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ఆంధ్రా, అక్కడి నుంచి బరోడా జట్టుకు దేశవాళీ క్రికెట్ ఆడారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతూ మెరుగైన ప్రదర్శన చేశాడు. 2023లో చైన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో అతను క్రికెట్‌కు వీడ్కొలు పలికాడు.