World Cup 2023: వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు మరో షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడ్డ పాండ్యా
ఈ వార్తాకథనం ఏంటి
తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌కి సిద్ధమవుతున్న తరుణంలో భారత జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
ఆక్టోబర్ 8న చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది.
ఇప్పటికే స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
దీంతో ఆస్ట్రేలియాకు మ్యాచుకు అతను దాదాపుగా అందుబాటులో ఉండడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా ప్రాక్టీస్‌లో చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది.
సిరాజ్ వేసిన ఓ బౌన్సర్, హార్దిక్ పాండ్యా వేలికి బలంగా తగిలింది.
దీంతో బ్యాటింగ్ చేయకుండానే పాండ్యా వెళ్లిపోయాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సమయానికి పాండ్యా కోలుకోకపోతే భారత్ కి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
Details
పాండ్యా గాయం గురించి క్లారిటీ ఇవ్వని బీసీసీఐ
ఐదోవ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్‌లో అద్భుతంగా పాండ్యా బ్యాటింగ్ చేయగలడు. అలాంటి ప్లేయర్ మ్యాచుకు దూరమైతే టీమిండియాకు ఇబ్బంది తప్పదు.
మరోవైపు హార్ధిక్ పాండ్యా గాయం గురించి ఇప్పటి వరకూ బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చైన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఆస్ట్రేలియా, భారత్ మ్యాచులో పాండ్యా ఆడుతాడా లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.
ఇక డెంగ్యూతో బాధపడుతోన్న గిల్ మ్యాచుకు దూరమైతే, రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషాన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.