
World Richest Cricketer: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్‌గా ఆర్యమన్ బిర్లా.. సచిన్, కోహ్లీని మించిన సంపద!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా భారత మాజీ క్రికెటర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా నిలిచాడు.
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి స్టార్ క్రికెటర్లను మించి ఆర్యమన్ నికర ఆస్తి రూ.70 వేల కోట్లకు పైగా ఉంది.
ఆర్యమన్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. 22 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆర్యమన్ ప్రస్తుతం బిర్లా గ్రూప్ వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నాడు.
1997లో జన్మించిన ఆర్యమన్, తన క్రికెట్ కెరీర్‌ను 2017లో ప్రారంభించాడు.
మధ్యప్రదేశ్ తరఫున 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 4 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 414 పరుగులు చేయగా, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 36 పరుగులు మాత్రమే సాధించాడు.
Details
యువతకు ఆదర్శంగా ఆర్యమన్
2018లో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టుతో జతకట్టినా, తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.
గాయాల కారణంగా అతను 2019లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆర్యమన్ తన ఫ్యామిలీ వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.
2023లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యాడు.
ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థల్లోనూ కీలక బాధ్యతలు చేపట్టాడు.
వ్యాపారరంగంలోనూ తన ప్రావీణ్యాన్ని చాటుకుంటున్న ఆర్యమన్ బిర్లా ఇప్పుడు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.