యాషెస్ సిరీస్: మ్యాచుకు వర్షం అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్ తొలి టెస్టులో 5వ రోజు ఆటకు వర్షం ఆటంకం ఏర్పడింది. ఐదో రోజు ఫలితం కోసం వేచిచూస్తున్న ఆభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా విజయానికి 90 ఓవర్లలో 174 పరుగులు కావాలి. అదే ఇంగ్లండ్ గెలవాలంటే ఏడు వికెట్లు కావాలి. ఇరు జట్లకు విజయావకాశాలకు సమానంగా ఉన్నప్పటికీ వరుణుడు బర్మింగ్ హోమ్‌లో నేటి ఉదయం నుంచి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
అయితే మధ్యలో కొంతసేపు వర్షం తగ్గినా మ్యాచు ప్రారంభానికి ముందు మళ్లీ వర్షం మొదలైంది
Details
ఇరు జట్లకు సమానంగా విజయావకాశాలు
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 273 పరుగులు చేయగా.. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగుల ఆధిక్యంతో కలిసి ఆ జట్టు ఆసీస్ ముందు 280 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 30 ఓవర్లలో 170 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (34), లాబుస్ చాగ్నే (13), స్టీవ్ స్మిత్ 6 పరుగులు చేసి పెవిలియానికి చేరారు. ఉస్మాన్ ఖావాజా (34 నాటౌట్), స్కాట్ బొలాండ్ (13 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.