యాషెస్ సిరీస్ : నాథన్ లియోన్ గాయంపై స్పందించిన స్టీవన్ స్మిత్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో రెండో రోజు జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ గాయపడ్డాడు.
37 ఓవర్లలో ఫీల్డింగ్ చేస్తుండగా నాథన్ లియోన్ బంతి అందుకున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద గాయపడ్డాడు. దీంతో అతను వెంటనే మైదానాన్ని వీడాడు. తర్వాత జరిగిన నెక్ట్స్ షెషన్‌లో లియోన్ మైదానంలో దిగలేదు.
దీనిపై స్టీవన్ స్మిత్ స్పందించాడు. నాథన్ కచ్చితంగా ఎలా ఉన్నాడో తెలియదని, అతని గాయం తీవ్రమైతే తమ జట్టుకు భారీ నష్టం జరుగుతుందని స్మిత్ చెప్పారు.
Details
నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మార్ఫీ!
ఒకవేళ నాథన్ గాయంతో యాషెస్ సిరీస్ కు దూరమైతే అతని స్థానంలో టాడ్ మార్ఫీని మూడో టెస్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచులో 13 ఓవర్లు వేసిన అతను ఒక వికెట్ ను పడగొట్టాడు.
లియాన్ 30 యాషెస్ టెస్టుల్లో 29.41 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. లియాన్ 122 టెస్టుల్లో 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు.
ఇందులో 23సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.