LOADING...
Ashwin: ఐపీఎల్‌కు గుడ్‌బై, కొత్త లీగ్‌లలో అడుగుపెడతా?: అశ్విన్‌ 
ఐపీఎల్‌కు గుడ్‌బై, కొత్త లీగ్‌లలో అడుగుపెడతా?: అశ్విన్‌

Ashwin: ఐపీఎల్‌కు గుడ్‌బై, కొత్త లీగ్‌లలో అడుగుపెడతా?: అశ్విన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌ను వీడ్కోలు చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఐపీఎల్ నుండి గుడ్‌బై అని ప్రకటించారు. ఈ నిర్ణయం బయటపడగానే క్రికెట్ విశ్లేషకులు,అభిమానులు విస్తృత చర్చలో మునిగిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మినీ వేలంలో అశ్విన్‌ను తప్పిస్తుందని, ఇతర జట్లు కూడా ఆయనను తీసుకోవడంలో ఆసక్తి చూపలేదనే వార్తలు వస్తున్నాయి. వీటినే ఆధారంగా, అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. తాజాగా, తన నిర్ణయానికి కారణాలు అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. ఐపీఎల్ కోసం దాదాపు మూడు నెలలపాటు వెచ్చించేంత ఎనర్జీ తనకు లేదనే విషయం అర్థమైందని తెలిపాడు.

వివరాలు 

వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా ఐపీఎల్ ఆడటానికి ఉత్సాహం తగ్గుతుంది

"నేను వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడగలనా అని ఆలోచించాను. మూడు నెలల ఐపీఎల్ నాకు ఎక్కువ అనిపించింది. దీని కారణంగా బాగా అలసిపోతున్నాను. ఎంఎస్ ధోని వంటి క్రికెటర్‌ను చూస్తుంటే ఆశ్చర్యమవుతోంది. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా ఐపీఎల్ ఆడటానికి ఉత్సాహం తగ్గుతుంది, కానీ ధోనీకీ ఇది వర్తించదు. నా ఆట అన్వేషకుడిగా ప్రారంభం అవుతుంది" అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

లీగ్ 

కొత్త లీగ్‌లో అవకాశాలు 

ఐపీఎల్ నుండి వెనుదిరిగి అశ్విన్ ఇతర దేశాల లీగుల్లో ఆడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అశ్విన్ కూడా దీనిని ధ్రువీకరించారు. "కొత్త లీగ్ కోసం నా పేరు నమోదు చేశాను" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో, ఏ లీగ్‌లో ఆడతారు అనేది అభిమానుల మధ్యం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఆయన ది హండ్రెడ్ లేదా ఎస్‌ఏ20 వంటి ఏదో లీగ్‌లో ఆడతారనే అంచనా ఉంది. అయితే, చివరికి ఎక్కడ ఆడతాడనేది అశ్విన్ అధికారికంగా వెల్లడించలేదు.