Page Loader
ఆసియా కప్ 2023: ఈ టోర్నీలో వీరి ఆట చూడాల్సిందే!
ఆసియా కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన విరాట్ కోహ్లీ

ఆసియా కప్ 2023: ఈ టోర్నీలో వీరి ఆట చూడాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2023
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌కు పాకిస్థాన్, శ్రీలంకలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచులు శ్రీలంకలో, నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగనుంది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది 10 వన్డేల్లో 53.37 సగటుతో 427 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలను బాదాడు. ముఖ్యంగా ఆసియాకప్‌లో భాగంగా 2012లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు. ఇక, అప్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ ఈ ఏడాది 15 వన్డేల్లో నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలను బాదాడు. ఆప్ఘనిస్తాన్ జట్టులో ఇబ్రహీం కీలకంగా వ్యవహరించే అవకాశముంది.

Details

లిట్టన్ దాస్ పై భారీ ఆశలను పెట్టుకున్న బంగ్లాదేశ్ జట్టు

వన్డేల్లో అత్యత్తుమ బ్యాటర్లలో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజం ఒకరు. వన్డేల్లో అత్యధిక వేగంగా 5వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది వన్డేలో 53.12 సగటుతో 425 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ జట్టు విజయాల్లో వికెట్‌కీపర్ లిట్టన్ దాస్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. 2022 నుండి ఇప్పటివరకూ 25 వన్డేలు ఆడి 41.80 సగటుతో 878 పరుగులు చేశాడు. కెప్టెన్సీ రేసులో ఉన్న లిట్టన్ దాస్‌పై బంగ్లాదేశ్ జట్టు భారీ ఆశలనే పెట్టుకుంది. శ్రీలంక తరుఫున పాతుమ్ నిస్సాంక 14 వన్డేల్లో 57.25 సగటుతో 687 పరుగులు చేశాడు. జూన్-జూలైలో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ప్లేయర్ గా రికార్డుకెక్కాడు.