
Asia Cup: భారత్-నేపాల్ మ్యాచుకి వరుణుడి గండం
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో భారత్ మ్యాచులకు వరుణుడి ఆటంకం తప్పడం లేదు. ఇండియా-పాక్ మ్యాచ్ ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
పల్లెకెలె వేదికగా జరిగిన దయాదుల పోరులో వరుణుడు ఆటకి ఆటంకం కలించడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభమవ్వకుండానే మ్యాచ్ రద్దయింది.
ఇక సోమవారం జరిగే భారత్, నేపాల్ మ్యాచుకు కూడా వర్షం ముప్పు ఉందని వాతవారణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే రోజు 80శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక వర్షం ప్రభావంతో టాస్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Details
సూపర్ 4కు అర్హత సాధించిన పాకిస్థాన్ జట్టు
ఈ టోర్నీలో ఇప్పటికే సూపర్ 4కు పాకిస్థాన్ జట్టు అర్హత సాధించింది.
ఒకవేళ వరుణుడి ఆటంకంతో టీమిండియా, నేపాల్ మ్యాచ్ కూడా రద్దయితే రెండు పాయింట్లతో భారత జట్టు సూపర్ 4కు అర్హత సాధించనుంది.
ఇక నేపాల్ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 10న మళ్లీ చిరకాల ప్రత్యర్థులపైన భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి.