Champions Trophy : ముగిసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 265
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్,ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73; 96బంతుల్లో 4ఫోర్లు,1 సిక్స్),అలెక్స్ కేరీ (61; 57 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్)అర్ధ శతకాలు సాధించారు.
ఓపెనర్ ట్రావిస్ హెడ్ (39; 33బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లు),మార్నస్ లబుషేన్ (29), బెన్ డ్వార్షుయిస్ (19), జోష్ ఇంగ్లిస్ (11),నాథన్ ఎల్లిస్ (10), మ్యాక్స్‌వెల్ (7) పరుగులు చేశారు. ఓపెనర్ కూపర్ కనోలీ (0) డకౌట్ అయ్యాడు.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు,రవీంద్ర జడేజా 2 వికెట్లు,వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు,అక్షర్ పటేల్,హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.
వివరాలు
విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు - అత్యధిక క్యాచ్‌ల ఘనత
ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేక రికార్డు సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు (335) పట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకుని కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు రాహుల్ ద్రావిడ్, కోహ్లీ పేర్లకు సంయుక్తంగా ఉండేది.
ఇప్పుడు కోహ్లీ స్వయంగా అగ్రస్థానంలో నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ తర్వాత రాహుల్ ద్రవిడ్ (334), మహమ్మద్ అజహరుద్దీన్ (261), సచిన్ టెండూల్కర్ (256) ఉన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఈ జాబితాలో మహేల జయవర్దెనె (440 క్యాచ్‌లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.