Asia Cup 2023: వారిద్దరి వల్లే పాక్ పటిష్టంగా తయారైంది: రవిచంద్రన్ అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 టోర్నీ నేటి నుంచి ఆరంభం కానుంది. ముల్తాన్ వేదికగా జరిగే ఆరంభ వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు పాక్ క్రికెట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్తాన్, నేపాల్ మధ్య్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్థాన్ జట్లు ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతున్నాయని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు.
గత ఐదారేళ్లుగా పాకిస్థాన్ ఇద్దరు ప్లేయర్ల వల్లే పటిష్టంగా మారిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
Details
బాబార్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ గొప్ప ఆటగాళ్లు
గత ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి టోర్నీలో పాక్ పేలవ ప్రదర్శన చేసేదని, గతంలో ఐసీసీ ట్రోఫీలను గెలిచిన అనుభవం పాక్ జట్టుకు అనుభవం ఉందని అశ్విన్ వెల్లడించారు.
గత ఆరేళ్లుగా బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ భాగస్వామ్యంతో పాక్ జట్టు అద్భుతంగా పుంజుకుందని, అదే విధంగా అంతర్జాతీయ అన్ని దేశాల్లో( భారత్ మినహా) ద్వైపాక్షిక సిరీస్ ఆడడం కూడా ఆ జట్టుకు కలిసొచ్చిందని అశ్విన్ పేర్కొన్నారు.
1990 మాదిరిగానే పాక్ బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్‌గా తయారైందని, పీఎస్ఎల్ తో పాటు, బీబీఎల్ లో పాకిస్థాన్ ఆటగాళ్లు విరివిరిగా పాల్గొనడం వాళ్ల సామర్థ్యం పెరిగిందన్నారు.