LOADING...
IND Vs SL: బ్యాడ్ లక్ శుభ్‌మాన్ గిల్.. త్రుటిలో సెంచరీ మిస్ 
బ్యాడ్ లక్ శుభ్‌మాన్ గిల్.. త్రుటిలో సెంచరీ మిస్

IND Vs SL: బ్యాడ్ లక్ శుభ్‌మాన్ గిల్.. త్రుటిలో సెంచరీ మిస్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2023
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో మొదట టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచులో భారత యువ ఓపెనర్ శుభమన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 92 బంతుల్లో (11 ఫోర్లు, 2 సిక్సర్లు) 92 పరుగులు చేశాడు. మధుశంక బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ వెనుతిరిగాడు. దీంతో ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని గిల్ కోల్పోయాడు. ఈ ఫార్మాట్‌లో గిల్ 90లలో ఔట్ కావడం ఇదే మొదటిసారి.

Details

విరాట్ కోహ్లీతో కలిసి 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన గిల్

ఇక మ్యాచ్ రెండో బంతికే రోహిత్ శర్మ ఔటైన తర్వాత గిల్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డే క్రికెట్‌లో గిల్‌కి ఇది 11వ అర్ధ సెంచరీ. 40వ వన్డేల్లో 62.14 సగటుతో 2,113 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు కూడా ఉన్నాయి. అదే విధంగా 2023లో వన్డేల్లో 1,200పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. 25 వన్డేల్లో 64.81 సగటుతో 1,426 పరుగులు చేశాడు.