LOADING...
ENG vs IND: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌.. టీమ్ఇండియా ఓపెన‌ర్లు ఫిక్స్‌..
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌.. టీమ్ఇండియా ఓపెన‌ర్లు ఫిక్స్‌..

ENG vs IND: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌.. టీమ్ఇండియా ఓపెన‌ర్లు ఫిక్స్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమవుతోంది. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు విరమణ ప్రకటించిన నేపథ్యంలో,ఆయన స్థానంలో ఎవరు ఓపెనర్‌గా బరిలోకి దిగతారనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు జోడిగా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలి రోజులలో బెకెన్‌హామ్‌లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా,ఇండియా-ఏ జట్ల మధ్య నిర్వహించిన ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టమైంది. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో, ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ క్రీజ్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు ఉన్నాయి.

వివరాలు 

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌

ఇంతకుముందు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా రోహిత్ శర్మ గైర్హాజరైనప్పుడు, కేఎల్ రాహుల్ యశస్వితో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో, ఇప్పుడు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఎలా ఆడుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. ఇదే సిరీస్‌తో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌కు ప్రారంభం అవుతుంది.

వివరాలు 

భార‌త్‌, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే.. 

తొలి టెస్టు - జూన్ 20 నుంచి జూన్‌ 24 వ‌ర‌కు - హెడింగ్లీ రెండో టెస్టు - జూలై 2 నుంచి జూలై 6 వ‌ర‌కు - ఎడ్జ్‌బాస్టన్ మూడో టెస్టు - జూలై 10 నుంచి జూలై 14 వ‌ర‌కు - లార్డ్స్‌ నాలుగో టెస్టు - జూలై 24 నుంచి జూలై 27 వ‌ర‌కు - ఓల్డ్ ట్రాఫోర్డ్ ఐదో టెస్టు - జూలై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు - కెన్నింగ్టన్ ఓవల్