BCCI: ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కఠిన చర్యలు.. టీమిండియాలో మళ్లీ యో యో టెస్టు..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టులో క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను నిర్ధారించడానికి ఒకప్పుడు యో యో టెస్టు (Yo Yo Test) పద్ధతిని అనుసరించారు.
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఈ టెస్టు క్రమం తప్పకుండ పాటించారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను సమర్థంగా కొలిచేందుకు ఈ పద్ధతి అనుసరించబడింది.
అయితే, ఈ కఠినమైన పరీక్ష వల్ల ఆటగాళ్లకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో బీసీసీఐ దీనిని వదిలివేశింది.
కానీ, క్రికెటర్ల ఫిట్‌నెస్ ఇప్పుడు మరింత ప్రాముఖ్యంగా మారడంతో, బీసీసీఐ ఈ టెస్టును మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆసీస్ పర్యటనలో భారత జట్టు ఘోరంగా పరాభవం పాలై పలు మార్పులు తీసుకురావాలని బీసీసీఐ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
వివరాలు
దేశవాళీ క్రికెట్‌లో ఆడడం తప్పనిసరి
ఈ పరిణామం నేపథ్యంలో,క్రికెటర్ల ఫిట్‌నెస్ విషయములో మరింత కఠినంగా వ్యవహరించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎటువంటి అపార్ధాలు జరగకుండా, ఫిట్‌నెస్‌ను కొలిచేందుకు 'యో యో' టెస్టు నిర్వహించాలని వైద్యబృందం సూచన ఇచ్చింది.
''క్రికెటర్లు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడటంతో బోర్డు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరించింది. కానీ,ఇప్పుడు గాయాలు కావడం ఇబ్బందికి గురి చేసే అంశంగా మారింది.కొందరు ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు. అందుకే, ఫిట్‌నెస్ స్థాయిని నిర్దేశించేందుకు అవసరమైన టెస్టును మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది'' అని బీసీసీఐ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.అలాగే, దేశవాళీ క్రికెట్‌లో ఆడడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. సరైన కారణాలతో అనుమతి తీసుకున్న క్రికెటర్లు మినహా.. మిగిలిన ఆటగాళ్లు డొమిస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే.
వివరాలు
అదనంగా బ్యాటింగ్ కోచ్‌ను కూడా..
మరోవైపు, భారత జట్టు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో దారుణంగా ఫెయిల్ అయ్యారు.
ఈ నేపథ్యంలో, కోచ్ గంభీర్ బృందంలో మరొక బ్యాటింగ్ కోచ్‌ను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.
అయితే, ఈ ప్రతిపాదన ఇప్పటి వరకు ప్రపోజల్‌గా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
గంభీర్ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత్ శ్రీలంకతో వన్డే సిరీస్, కివీస్, ఆసీస్ జట్లతో టెస్టు సిరీస్‌లను కోల్పోయింది.
బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా తన స్కిల్స్‌ను చూపించినప్పటికీ, మిగిలిన బౌలర్ల నుండి సహకారం పెద్దగా దక్కలేదు..
బ్యాటింగ్ విభాగం మరింత విఫలమవ్వడం, మరిన్ని మార్పులు అవసరమవుతాయనే భావనను బోర్డు వ్యక్తం చేస్తోంది.