Shreyas Iyer-BCCI: శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించిన NCA.. BCCI చర్యలు తీసుకుంటుందా?
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్,శ్రేయస్ అయ్యర్, వెన్ను గాయం కారణంగా మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత భారత జట్టు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే,శ్రేయస్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐకి జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)వైద్య బృందం రిపోర్ట్ ఇచ్చింది. బరోడాతో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు శ్రేయాస్ జట్టుకు అందుబాటులో ఉండడం లేదని ముంబై క్రికెట్ అసోషియేషన్ పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం,NCA స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత జట్టు హ్యాండ్‌ఓవర్ నివేదిక ప్రకారం శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని,ఎంపికకు అందుబాటులో ఉన్నాడని నితిన్ పటేల్ ఒక ఈ మెయిల్ రాశారు.
రంజీ ఆడకపోతే కఠిన చర్యలు: జై షా
శ్రేయస్ టీమ్ ఇండియా నుండి నిష్క్రమించిన తర్వాత కోతగా గాయమే లేదని, అతను ఫిట్‌గానే ఉన్నాడని బీసీసీఐకి NCA రిపోర్ట్ ఇచ్చింది. ఇదిలా ఉండగా, కేంద్ర కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లందరూ,భారత పర్యటనలకు ఎంపిక కాకపోతే, వారు గైర్హాజరు కావడానికి ముఖ్యమైన కారణం లేకుంటే తప్పనిసరిగా దేశవాళీ టోర్నీ ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేశారు. శ్రేయాస్ అయ్యర్‌తో పాటు, టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్, ఇషాన్ కిషన్ కూడా జార్ఖండ్ తరపున రంజీ ట్రోఫీలో ఆడని విషయం తెలిసిందే. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు దూరంగా ఉండి టీ-20 లీగ్‌లలో ఆడటంపై దృష్టి సారించిన ఆటగాళ్లపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.