IPL 2027: ఐపీఎల్‌కు మళ్లీ బెన్ స్టోక్స్...సత్తా చాటేందుకు సిద్దమౌతున్న ఆర్వవీర్ సెహ్వాగ్
ఈ వార్తాకథనం ఏంటి
మూడేళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్-2027 మినీ వేలంలో పాల్గొనేందుకు స్టోక్స్ తన పేరును నమోదు చేసుకున్నాడు. గతంలో దేశం తరఫున ఆడటానికే ప్రాధాన్యం ఇస్తూ ప్రైవేట్ లీగ్‌లకు దూరంగా ఉన్న అతడు, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు. ఈసారి రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలం బరిలోకి దిగనున్నాడు. దీంతో స్టోక్స్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశముంది.
Details
స్టోక్స్ కోసం మూడు జట్ల ఆసక్తి
బెన్ స్టోక్స్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆసక్తి చూపే అవకాశముంది.
ముఖ్యంగా కేకేఆర్ అతడిని సొంతం చేసుకుంటే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
గతంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున స్టోక్స్ ఆడాడు.
2023లో చివరిసారిగా ఐపీఎల్‌లో కనిపించిన ఈ ఆల్‌రౌండర్ తిరిగి వస్తుండటంతో వేలం మరింత ఆసక్తికరంగా మారింది.
Details
వేలంలో 1,220 మంది ఆటగాళ్లు
వచ్చే నెల 16న జరగనున్న ఐపీఎల్-2027 మినీ వేలానికి ఏకంగా 1,220 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
వీరిలో డేవిడ్ వార్నర్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కామెరూన్ గ్రీన్, బెయిర్‌స్టో, ఫెర్గూసన్, నోర్జే, రబాడ, హసరంగ, మతీషా పతిరణ, హెట్మేయర్ వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.
మొత్తం 66 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉండటంతో ప్రతి ఆటగాడి కోసం పోటీ కీలకంగా మారనుంది.
Details
ఆర్యవీర్ సెహ్వాగ్‌పై కూడా ఫోకస్
ఈసారి భారత ఆటగాళ్లలో కూడా ఆసక్తికరమైన పేర్లు వేలం జాబితాలో ఉన్నాయి.
మొత్తం 1,220 మందిలో 939 మంది భారతీయులు కాగా, 281 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగుతున్నారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా వేలంలో పాల్గొననున్నాడు.
దీంతో బెన్ స్టోక్స్ రీఎంట్రీతో పాటు ఆర్యవీర్ ఎంట్రీపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వేలంలో ఎవరికి భారీ ధర పలుకుతుందో చూడాలి.