Page Loader
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టు అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2023
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికాపై గడ్డపై టీమిండియా(Team India) టెస్టు పోరుకు సన్నద్ధమవుతున్నది. రెండు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి 30 వరకు ఇరు జట్ల (IND-SA) మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచును 'బాక్సింగ్ డే టెస్టు'(Boxing Day Test) గా పిలుస్తారు. అదే విధంగా ఈనెల 26న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రెండో టెస్టు మ్యాచును కూడా అదే పేరుతో పిలుస్తారు. అసలు ఆ మ్యాచులను అలా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, నైజీరియా, ఇంగ్లండ్ లతో పాటు పలు దేశాల్లో క్రిస్మస్ జరిగిన మరుసటి రోజును 'బాక్సింగ్ డే' గా జరుపుకుంటారు.

Details

1950లో తొలి బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్

ఈ వేడుక వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంగ్లండ్ లో 1800లో విక్టోరియా మహారాణి సింహాసనాన్ని అదిష్టించిన రోజును బాక్సిండ్ డేగా పిలుస్తారు. అయితే క్రిస్మస్ రోజున సెలవు తీసుకోకుండా పని చేసే ఉద్యోగులకు మరుసటి రోజు బాక్స్ రూపంలో బహుమతి ఇచ్చి హాలీడ్ ఇస్తారు. అందుకే బాక్సింగ్ డే అని పిలుస్తారనేది మరో కథ. అయితే డిసెంబర్ 26న బాక్సింగ్ డే ను నిర్వహిస్తారు కాబట్టి ఆ రోజున ప్రారంభమయ్యే టెస్టును బాక్సిండ్ టెస్టుగా పిలుస్తారు. ఇక 1950లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమైంది.