Jasprit Bumrah: ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినేషన్‌లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా
ఈ వార్తాకథనం ఏంటి
2024 సంవత్సరానికి 'ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు నామినేషన్లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది.
ఈ నామినేషన్లలో ఇంగ్లండ్‌కు చెందిన బ్యాటర్లుగా జోయ్ రూట్,హ్యారీ బ్రూక్, శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్ కూడా ఉన్నారు.
బుమ్రా 2024లో 13 టెస్టు మ్యాచ్‌లను ఆడి,14.92 సగటుతో 71 వికెట్లు తీసి కొత్త రికార్డులు సృష్టించాడు.
ఆయన 30.16 స్ట్రైక్ రేటుతో అద్భుత ప్రదర్శనను కనబరచాడు.
అలాగే,భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ బుమ్రా అద్భుతంగా రాణించి, 4 టెస్టు మ్యాచ్‌లలో 30 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
2023లో బ్యాక్ పెయిన్ నుంచి కోలుకుని వచ్చిన తర్వాత బుమ్రా వదిలే బంతుల్లో పదును పెరిగింది.
వివరాలు
నాలుగో స్థానంలో బ్రూక్
ఇంగ్లండ్ బ్యాటర్ జోయ్ రూట్ 2024లో 17 టెస్టులు ఆడి 55.57 సగటుతో 1,556 పరుగులు సాధించాడు.
రూట్ ఈసారి ఐదవసారి ఒక క్యాలెండర్ ఇయరులో 1000కి పైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.
2021లో అతను 1,708 పరుగులు చేసిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్‌లోనే మరో బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో 1,100 పరుగులు చేసి నామినేషన్లలో చోటు సంపాదించాడు.
బ్రూక్ 2024లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.
రూట్ అగ్రస్థానంలో ఉండగా,యశస్వి జైస్వాల్,బెన్ డుకాటీ ఈ జాబితాలో రెండో,మూడో స్థానాల్లో ఉన్నారు.
బ్రూక్ 2024లో ఒక మ్యాచ్‌లో 322 బంతులను ఎదుర్కొని 317 పరుగులు సాధించి ఐసీసీ నుంచి ప్రశంసలు పొందాడు.
వివరాలు
'ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' నామినేషన్ లో కామిందు మెండిస్
శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్ 2024లో 9 టెస్టులు ఆడి 74.92 సగటుతో 1,049 పరుగులు సాధించాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో అతనికీ ఐసీసీ అవార్డుకు నామినేషన్ వచ్చింది.