LOADING...
Jasprit Bumrah : బుమ్రా ఐదో టెస్టుకు దూరం.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్‌!
బుమ్రా ఐదో టెస్టుకు దూరం.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్‌!

Jasprit Bumrah : బుమ్రా ఐదో టెస్టుకు దూరం.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 224 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 247 పరుగులతో ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 23 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (51), ఆకాశ్ దీప్ (4) క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే, టెస్ట్ సిరీస్ ముగింపునకు చేరుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రాను జట్టులోనుంచి విడుదల చేసింది.

Details

సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన బీసీసీఐ

ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో బుమ్రా స్వదేశానికి తిరుగుపోతున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్టిలో ఉంచుకొని బుమ్రాను ఐదో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉండనివ్వకపోవడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. కాగా బుమ్రా గత కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బుమ్రా కేవలం మూడు టెస్టులకే అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశారు. అతను తొలి, మూడో, నాలుగో టెస్టుల్లో ఆడి మొత్తం 14 వికెట్లు తీసాడు. ఇందులో లార్డ్స్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ శ్రేష్ఠ ప్రదర్శనతో లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరును లిఖించుకున్నాడు.