Page Loader
తండ్రి అయ్యిన స్టార్‌ పేసర్‌.. ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసిన బుమ్రా 
తండ్రి అయ్యిన స్టార్‌ పేసర్‌.. ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసిన బుమ్రా

తండ్రి అయ్యిన స్టార్‌ పేసర్‌.. ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసిన బుమ్రా 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2023
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. సోమవారం తన సోషల్ మీడియా ద్వారా తను కొడుకు పుట్టినవార్తను పంచుకున్నాడు. "మా చిన్న కుటుంబం పెరిగింది. మా హృదయాలు మేము ఊహించలేనంత నిండుగా ఉన్నాయి! ఈ ఉదయం మా చిన్నారి అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం దానితో పాటు తెచ్చే ప్రతి క్షణాన్ని ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాం.జస్ప్రిత్,సంజన,"అంటూ బుమ్రా ఒక చిత్రంతో పాటు క్యాప్షన్‌గా రాశారు. దీంతో తోటి క్రికెటర్లు,అభిమానులు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆసియా కప్‌లో నేడు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. వెన్ను గాయంతో సుదీర్ఘకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఇటీవల టీమ్‌ఇండియాలోకి పునరామనం చేశాడు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసిన బుమ్రా