గెలిస్తేనే కెప్టెన్లను గుర్తు పెట్టుకుంటారు.. రోహిత్ శర్మపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని నెగ్గింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా నియామకమైన మరో ఐసీసీ ట్రోఫీని నెగ్గలేదు. కోహ్లీ స్థానంలో వచ్చిన రోహిత్ శర్మ కూడా 2022 ఆసియా కప్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు కెప్టెన్లు మారి, మూడో కెప్టెన్ వచ్చినా పరిస్థితి మాత్రం మారలేదు. ఇక 40 రోజుల్లో వన్డే వరల్డ్ కప్ రానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని గెలిచినా పెద్దగా పేరు రాదని, ఐసీసీ ట్రోఫీలో విజయం సాధించిన కెప్టెన్ నే అందరూ గుర్తు పెట్టుకుంటున్నారని గవాస్కర్ వెల్లడించారు.
టాలెంట్ ఉన్న కొంచెం అదృష్టం కలిసి రావాలి
ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టును విజేతగా నిలిపితే తప్పకుండా రోహిత్ శర్మ గొప్ప సారథులతో ఒకరిగా నిలిచిపోతారని, హిట్ మ్యాన్ కు ఆ సారథ్యం ఉందని గవాస్కర్ పేర్కొన్నారు. అందరూ నాలుగో స్థానం కోసం గురించి మాట్లాడుతారని, అయితే భారత జట్టుకు ఆల్ రౌండర్ల సమస్య ప్రధానంగా ఉందని, 1983, 1985, 2011 వరల్డ్ కప్ జట్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఆల్ రౌండర్లు ఉంటే ఎలాంటి జట్టుకైనా అదనపు ప్రయోజనం చేకూరుతుందని, ధోని నాయకత్వంలో జట్టును పరిశీలిస్తే, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్లేయర్లు బౌలింగ్ చేయగల సమర్థులని గుర్తు చేశారు.