Page Loader
India vs NZ: షమికి 5వికెట్లు .. మిచెల్ సెంచరీ.. టీమిండియా టార్గెట్ 274 పరుగులు 
India vs NZ: షమికి 5వికెట్లు .. మిచెల్ సెంచరీ.. టీమిండియా టార్గెట్ 274 పరుగులు

India vs NZ: షమికి 5వికెట్లు .. మిచెల్ సెంచరీ.. టీమిండియా టార్గెట్ 274 పరుగులు 

వ్రాసిన వారు Stalin
Oct 22, 2023
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచ కప్‌-2023లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌ ధర్మశాల స్డేడియంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసారు. దీంతో నిర్ణీత 50ఓవర్లలో న్యూజిలాండ్ 273 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లకు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సెంచరీ(130)తో అదరగొట్టగా, రచిన్ రవీంద్ర్ 75 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమి 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, బూమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. షమి వరల్డ్ కప్‌లో 5 వికెట్లు తీసుకోవడం ఇది రెండోసారి. 2019లో కూడా బంగ్లాదేశ్‌పై 5వికెట్లు తీసుకున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మిచెల్ మార్ష్ 130 పరుగులు