ICC Champions trophy 2025: 53 శాతం పెరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. విజేతకు రూ.20.8 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఆతిథ్యంలోని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఎనిమిది జట్లు తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. టీమ్‌ఇండియా మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు.
తాజా అప్‌డేట్‌గా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది.
చివరిసారిగా 2017లో ఈ టోర్నీ నిర్వహించగా, అప్పటి కంటే ప్రైజ్‌మనీ దాదాపు 53% పెంచడం గమనార్హం.
మొత్తం రూ.60 కోట్ల ప్రైజ్‌మనీని జట్లకు కేటాయించనుండగా, చివరి స్థానంలో నిలిచిన జట్టుకూడా రూ.1.22 కోట్లు పొందనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు అదనంగా రూ.29 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
వివరాలు
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్
ఈసారి ప్రైజ్‌మనీ విభజన ప్రకారం, విజేతగా నిలిచే జట్టుకు రూ.20.8 కోట్లు అందించనున్నారు.
రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.10.4 కోట్లు కేటాయించనున్నారు. సెమీఫైనల్స్ చేరిన ప్రతీ జట్టుకు రూ.5.2 కోట్లు లభించనుండగా, ఐదో, ఆరో స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.3 కోట్లు ఇవ్వనున్నారు. ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.1.2 కోట్లు లభించనున్నాయి.
గతంలో 2017లో నిర్వహించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో,భారత్‌ను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది.
ఆ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టుకు రూ.14.18 కోట్లు ప్రైజ్‌మనీగా లభించగా,రన్నరప్‌గా నిలిచిన భారత్ రూ.7 కోట్లు పొందింది.
సెమీఫైనల్స్ చేరిన ఇంగ్లండ్,బంగ్లాదేశ్ జట్లకు ఒక్కొక్కటీ రూ.3 కోట్లు అందాయి.
వివరాలు
క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా ప్రైజ్‌మనీ
ఐదో, ఆరో స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు చెరో రూ.58 లక్షలు లభించగా, చివరి రెండు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు చెరో రూ.39 లక్షలు అందాయి.
ఈసారి ఐసీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంచడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పెరుగుదలతో జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.